జిల్లా గ్రంధాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవం వేడుకలు

మార్చి-8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా గ్రంధాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవం వేడుకలలో భాగంగా పాటశాల విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నందు పాల్గొన్న కుమారి అంగోత్ బిందు, గౌరవ చైర్ పర్సన్, జిల్లా ప్రజా పరిషత్,మహబూబాబాద్ గారు ఈ సమావేశాన్ని ఉద్ధేశించి మాట్లాడుతూ ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా శుభాకాంక్షలు తెలియజేస్తూ గత 25 సంవత్సరాల క్రితం తను పుట్టిన పరిస్థితులకు ఈ రోజు ఉన్న పరిస్థితులకు చాలా తేడా వచ్చిందని ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఐన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మహిళ ల అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలు , పథకాలు స్త్రీల ఉన్నతికి ఎంతో దోహదం చేస్తున్నాయని గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య లక్ష్మీ పథకం వారికి పోషక ఆహారం అందిస్తూ ప్రసవ అనంతరం కేసిఆర్ కిట్ లు, ఆడపిల్ల పుడితే₹13,000/- ఇస్తున్నారని, విద్యార్థి దశలో కేజీ టు పిజి లో భాగంగా గురుకులాలు ఏర్పాటు మంచి విద్యను అందిస్తున్నారని , ఆడపిల్లల రక్షణ కొరకు నిర్భయ, దిశ, ఫోక్సో చట్టాల ద్వారా న్యాయం చేస్తున్నారని, అభాగ్యులైన ఆడవాళ్ళ కొరకు సఖి కేంద్రాల ద్వారా రక్షణ కల్పిస్తూ ఉపాధి కల్పిస్తున్నారని, పెళ్ళిడుకు వచ్చిన ఆడపిల్లల పెళ్లి కి ₹1,00,116/- లు ఇస్తున్నారని, ఒంటరి మహిళలకు పింఛను, వృద్ధాప్యంలో పింఛను తో ఆసరా అవుతున్నారని , విద్య, ఉపాధి లోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా మహిళలు రాణించాలని 50% రిజర్వేషన్ లను మహిళలకు కల్పించారని, మహిళలకు అన్ని విధాల ఆదుకుంటు మహిళ బంధువుగా కేసిఆర్ ఉన్నారని, అందుకే మనం ఈరోజు మహిళా భందు కేసిఆర్ పేరుతో మూడు రోజుల పాటు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని కావున నేటి విద్యార్థినులు అబ్బాయిలతో సమానంగా ఆటల్లో, పాటల్లో ముందు ఉండి భవిష్యత్తులో విద్యా, వైజ్ఞానిక, శాస్త్రసాంకేతిక, రాజకీయ రంగాల్లోఉన్నత స్థితిలో ఉండాలని ఆకాంక్షిస్తున్నాను అని తెలిపారు
ఈ కార్యక్రమంలో శ్రీమతి మాలోత్ కవిత, గౌరవ పార్లమెంట్ సభ్యురాలు మరియు తెరాస జిల్లా అధ్యక్షురాలు, జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ శ్రీ గుడిపూడి నవీన్ రావు గారు, జిల్లా అదనపు కలెక్టర్ కుమారి అభిలాష అభినవ్ (లోకల్ బాడీ) గారు, మహబూబాబాద్ మునిసిపల్ చైర్మన్ శ్రీ రామ్మోహన్ రెడ్డి గారు, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి గారు, ఇతర ప్రజా ప్రతినిదులు మరియు వివిధ పాఠశాలల విద్యార్థినులు ,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.