జిల్లా టాపర్ గా మరిపెడ మోడల్ కళాశాల విద్యార్థినిశ్రావణి

మరిపెడ మోడల్ కళాశాల విద్యార్థిని బి శ్రావణి ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం బైపీసీలో 1000 మార్కులకు గాను 978 మార్కులు సాధించి మహబూబాబాద్ జిల్లా స్థాయి టాపర్ గా నిలిచింది. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి సత్యవతి రాథోడ్ శ్రావణి కి మెమొంటో తో పాటు ప్రశంస పత్రం ను అందజేశారు. శ్రావణి కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శశాంక, అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, జెడ్పీ చైర్పర్సన్ కుమారి బిందు, జిల్లా విద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.