జిల్లా ప్రజలు అందరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలి : ఎస్పీ

జిల్లా ప్రజలు అందరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలి : ఎస్పీ నంద్యాల.కోటిరెడ్డి.

మాస్క్ ధరించకుండా తిరిగే వారికి E – challan ద్వారా 1000/-రూపాయలు జరిమానా విధించాలని జిల్లా పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ..

కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం మాస్కులు ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో సంచరించే వారికి వేయి రూపాయల జరిమానా విధించబడుతుందని జిల్లా ఎస్పీ నంద్యాల.కోటిరెడ్డి తెలిపారు. జిల్లా ప్రజలందరూ తప్పనిసరిగా నిత్యం మాస్కులు ధరించి,భౌతిక దూరాన్ని పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ రోజు నుండి ఎవరైనా మాస్కులు లేకుండా రోడ్లపైకి వస్తే G.O no.82 ఉత్తర్వుల ప్రకారం 51(బి) సెక్షన్ ఆఫ్ డిసాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం పోలీసు వారు E-challan ద్వారా వారికి 1000/- రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించడంతో పాటు విధిగా మాస్కులు ధరించి పోలీసు వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.