జుాన్ 19,20న హాలియాలో జరిగే kvps 8వ జిల్లా మహసభలను జయప్రదం చేయండీ

కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నల్లగొండ జిల్లా 8వ మహాసభలు జూన్ 19, 20వ తేదీలలో హాలియాలో జరగనున్నట్లు కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున తెలిపారు.ఈ రోజు స్థానిక దొడ్డి కొమురయ్య భవన్ లో సంఘం జిల్లా కమిటీ సమావేశం కొండేటీ శ్రీను అద్యక్షతన జరిగింది.ఈ సందర్బంగా పాలడుగు నాగార్జున మాట్లాడుతూ నల్లగొండ జిల్లావ్యాప్తంగా మండల గ్రామ మహాసభలు పూర్తిచేసుకొని 300 మంది ప్రతినిధులతో హాలియా లో జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 19 న ధళితుల సంక్షేమం-ప్రభుత్వాల పాత్ర అంశంపైనా సెమినార్ వుంటుందని తెలిపారు. 20 ఉదయం 10 గంటలకు kvps జెండావిష్కరణ వుంటుందని తెలిపారు. ఈమహసభలకు ముఖ్య అతిధిగా సంఘం వ్యవస్థాపకులు రాష్ట్ర అద్యక్షులు జాన్ వెస్లీ గారు హజరవుతారని తెలియజేశారు.గత 3 సంవత్సరాలుగా జిల్లాలో నిర్వహించిన కార్యక్రమాలు మరియు భవిష్యత్తులో నిర్వహించబోయె ఉద్యమాల గురించీ చర్చించీ కార్యచరణ రుాపొందిచనున్నట్లు తెలిపారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల సంక్షేమం అభివృద్ధికి అనేక పథకాలు వాగ్దానాలు చేసి నేడు ఒక్కటి కూడా అమలు చేయడం లేదని అన్నారు. మూడెకరాల భూమి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కలగా మిగిలిపోయే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడు సంవత్సరాలుగా ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీలు ఇండస్ట్రియల్ సబ్సిడీలు అందడం లేదని అన్నారు. దళిత బంధు పథకం మొదటి విడతగా నియోజకవర్గానికి 100 మందికి ఇచ్చి చేతులు దులుపుకుంటుందని , రెండో విడతలో నియోజకవర్గానికి 5000 వేల మంది దళితులకు పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
కేంద్ర మనువాద ప్రభుత్వం భారత రాజ్యాంగానికి ముప్పువాటిల్లే విధానాలు తీసుకువస్తుందని రిజర్వేషన్లను తొలగించే కుట్ర జరుగుతుందని అన్నారు. మనువాద పాలిత ప్రాంతాలలో దళితులపై గిరిజనులపై అత్యంత దారుణంగా దాడులు చేసి హత్యలు చేస్తున్నారని అన్నారు. దేశంలో కుల దురహంకార హత్యలు పెరిగిపోయాయని నిందితులకు రక్షణ కల్పిస్తున్న పోలీసులు బాధితులను గాలికి వదిలేస్తున్నారని అన్నారు. విద్యా ఉపాధి వైద్యం కొరకై భవిష్యత్తులో మహాసభల్లో చర్చించి పెద్దఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని తెలియజేశారు.
ఈ సమావేశంలో కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు రెమిడాల పరుష రాములు ,జిట్ట నాగెష్ జిల్లా ఉపాధ్యక్షులు దైద శ్రీను,గాదే నర్సింహ్మ , బొట్ట శివ , జిల్లా కమిటీ సభ్యులు దొంతల నాగార్జున, బొల్లు రవీందర్ కొడిరెక్క మల్లన్న దొంతాల నాగార్జున గంటెకంపు రమనయ్య చిలుముల రామస్వామీ వంటెపాక క్రిష్ణ బొంగరాల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.