జూన్ 3 నుంచి 18వ తేదీ వరకు జరిగే 5వ విడుత పల్లె ప్రగతిని విజయవంతం చేయాలని మరిపెడ ఎంపిపీ గుగులోతు అరుణ రాంబాబు అన్నారు. మంగళవారం మరిపెడ ఎంపిడిఓ కార్యాలయం లో మండలం లోని గ్రామ పంచాయతీ కార్యదర్శులు, గ్రామ స్పెషల్ అధికారులతో పల్లె ప్రగతి పై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిపీ మాట్లాడారు. కార్యక్రమంలో తహసీల్దార్ పిల్లి రాంప్రసాద్ ఎంపీడీవో కేలోతు ధన్ సింగ్, ఎంపీఓ పూర్ణ చందర్ రెడ్డి, ఉపాధి హామీ ఏపిఓ మంగమ్మ, గ్రామ స్పెషల్ ఆఫీసర్ లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.