జూలై 31న డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మోడల్ కానిస్టేబుల్ టెస్ట్ పోస్టర్ ను ఆవిష్కరన

భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) ఆధ్వర్యంలో జులై 31న నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ మోడల్ పరీక్ష ను అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని హానుమకొండ ఏసిపి ఏ.కిరణ్ కుమార్ పిలుపునిచ్చారు.
డివైఎఫ్ఐ హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మోడల్ కానిస్టేబుల్ పరీక్ష కొసం రూపొందించిన పోస్టర్ ను హనుమకొండ ఏసీపి కార్యాలయంలో ఎసిపి చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడారు….నమూనా పరీక్షలు రాయటం ద్వారా అభ్యర్థులకు ఉపయోగం జరుగుతుందనీ, అవగాహన పెరుగుతుందని, పరీక్షల పట్ల అభ్యర్థులు ఆందోళన చెందకూడదని ప్రశాంతంగా ఉండాలని అన్నారు.డివైఎఫ్ఐ సంఘం మంచి ప్రయత్నం చేస్తుందని, యువతలో దేశభక్తి భావాలను పెంపొందించడం కోసం క్రమశిక్షణను నేర్పించడంలో, చైతన్యం అందించడంలో డివైఎఫ్ఐ కృషి అభినందనీయమన్నారు.
జులై 31వ తేదీన, శార్వాణి డిగ్రీ కాలేజి నయీమునగర్, హనుమకొండ నందు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు పరీక్ష ఉంటుందని,ఆసక్తి గల అభ్యర్థులు 8074006616,9848945141,7330988693,+918919859817 నెంబర్లకు సంప్రదించగలరని, నవతెలంగాణ బుక్ హౌస్,(ఏ టు జెడ్ మెడికల్ షాప్ పైన హనుమకొండ) హాల్ టికెట్లు పొందగలరని డివైఎఫ్ఐ నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నోముల కిషోర్, జిల్లా కార్యదర్శి దోగ్గేల తిరుపతి, జిల్లా సహాయ కార్యదర్శి వల్లపు లక్ష్మణ్,జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్ కూస రాజేష్, జిల్లా కమిటీ సభ్యులు ఓర్సు చిరంజీవి పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.