పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్త ను కడుపులో పెట్టుకొని చూసుకుంతమని, తగిన గుర్తింపు ఇస్తామని భరోసా
👉 ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల వైపు తీసుకెళ్లడానికి విస్తృతమైన ప్రచారం నిర్వహించాలి
ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు
సమిష్టి కృషితో పార్టీని మరింత బలోపేతం చేసి తిరుగులేని శక్తిగా నిలబడతానని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.బుధవారం అనంతగిరి మండలం అమీనాబాద్ గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ……. పార్టీని మరింత బలోపేతం చేయడమే ముందున్న లక్ష్యం అని ఆయన అన్నారు.టిఆర్ఎస్ ప్రజల పార్టీ అని సంక్షేమ పార్టీ
అని ఆయన అన్నారు.పార్టీ కన్న తల్లి లాంటిదని, కష్టపడ్డ వారికి ఖచ్చితంగా గుర్తింపు ఇస్తుంది అని ఆయన అన్నారు.పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్త ను కడుపులో పెట్టుకొని చూసుకుంటామని అన్నారు.ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల వైపు తీసుకెళ్లడానికి విస్తృతమైన ప్రచారం నిర్వహిస్తా ఆయన తెలిపారు.దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందని, వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లి వారి సంక్షేమానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.పార్టీ బలోపేతానికి ఎల్లవేళల కృషి చేస్తానని , ప్రతి కార్యకర్త కు న్యాయం జరిగేలా చూస్తానని అన్నారు. ఈ ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గింజుపల్లి రమేష్, గ్రామ శాఖ అధ్యక్షులు రామినేని పూర్ణచందర్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి, జడ్పిటిసి ఉమా శ్రీనివాస్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు విశ్వేశ్వరరావు, శ్రీనివాస్ గౌడ్, సుంకర పుల్లారావు,జొన్నలగడ్డ శ్రీనివాసరావు, శ్రీనివాస రావు, తదితరులు పాల్గొన్నారు.