వరంగల్, నల్లగొండ, ఖమ్మం నియోజకవర్గ పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశవాద టిఆర్ఎస్, మతతత్వ బిజెపి పార్టీలను ఓడించాలని వామపక్ష ఎమ్మెల్సీ అభ్యర్థి విజయసారధి రెడ్డి పిలుపునిచ్చారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని గీత కార్మిక సంఘం కార్యాలయంలో జరిగిన పట్టభద్రుల సమావేశానికి కళా కృష్ణ అధ్యక్షతన జరిగింది, ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థి,జయ సారథి రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని, ఉద్యోగులను, నిరుద్యోగులను అన్ని రంగాల ప్రజలను టిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. ఖాళీల భర్తీపై దొంగ లెక్కలు చెబుతున్నారని, దీనికి ప్రభుత్వం చర్చకు రావాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం చెప్పేవి దొంగ లెక్కలని తాను నిరూపిస్తానని, ప్రభుత్వమే వాస్తవమని నిరూపిస్తే తాను పోటీ నుండి వైదొలుగుతానని సవాల్ విసిరారు. టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరేళ్ల కాలంలో చేసిందేమీ లేదని, ఆయన గెలవడం వల్ల ప్రజలకు ఉపయోగం లేదన్నారు. ప్రజల పక్షాన పోరాడుతున్న తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం రాజీవ్ చౌరస్తాలో ఓటర్లను కలిసి తనకు ఓటు వేయాల్సిందిగా కోరారు,ఈ కార్యక్రమంలో సిపిఐ మహబూబాద్ జిల్లా కార్యదర్శి విజయ సారథి, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జనగామ జిల్లా కార్యదర్శి మామిండ్ల రమేష్ రాజా, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సోమ సత్యం,సింగారపు రమేష్, జిల్లా కమిటీ సభ్యులు జీడి సోమయ్య, సిపిఎం మండల కార్యదర్శి చిట్యాల సోమన్న, సింగం విష్ణు, చిలక మారి శ్రీను, నూదల రాము, గోపాల్, ఎం శ్రీనివాస్, ఏం సురేష్, బద్రి, సందీప్, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.