పదోన్నతి పొందిన తుమ్మలపల్లి నారాయణ సర్
శుభాకాంక్షలు తెలియజేసిన TRRS రామగుండం కమిటీ
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో ఇన్స్పెక్టర్ గా పనిచేస్తు అనేక సమస్యలపై వెంటనే స్పందించిన రజక ముద్దుబిడ్డ అహర్నిశలు జాతి శ్రేయస్సు కోసం అభ్యున్నతి కోసం బడుగు బలహీన వర్గాల కోసం తన శక్తివంచనతో కృషి చేస్తూ తన వృత్తి ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తిస్తున్న జాతి ఆణిముత్యం గౌరవనీయులు తుమ్మలపల్లి నారాయణ సర్ ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి డీఎస్పీగా పదోన్నతి పొందిన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి కమిటీ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తు శాలువతో సన్మానించడం జరిగింది.
రాష్ట్ర కళా మండలి అధ్యక్షులు మాట్లాడుతూ పదోన్నతి పొందిన శ్రీ తుమ్మలపల్లి నారాయణ సర్ గారు మరెన్నో పదవులు పొంది ఉన్నత స్థితికి చేరుకోవాలని అదేవిధంగా ఆయురారోగ్యాలతో జీవించాలని భగవంతుని కోరుకుంటున్నాం.
ఈ కార్యక్రమంలో పాల్గొనవారిలో ముఖ్యులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగుల కనకయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాసర్ల సంపత్, పెద్దపల్లి జిల్లా గౌరవ అధ్యక్షులు రాచూరి నర్సయ్య, జిల్లా అధ్యక్షురాలు మడికొండ ఓదక్క ,జిల్లా యూత్ సలహాదారులు దబ్బట రాజమౌళి, జిల్లా యూత్ ఆర్గనైజింగ్ కార్యదర్శి వైనాల రవి ,రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు నగునూరి శంకర్, కార్పొరేషన్ ఉపాధ్యక్షులు బొడ్డుపల్లి నారాయణ, కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి దుర్శెట్టి శ్రీనివాస్, గోదావరిఖని కోర్టు క్లర్క్ రాజమౌళి, ప్రభుత్వ హాస్పిటల్ పున్నం బాలయ్య తదితరులు పాల్గొన్నారు.