KAZIPEAT NEWS

నాయిని రాజేందర్ రెడ్డి.

కాజిపేట్ మీడియా పాయింట్ పత్రికా విలేకరుల సమావేశంలో నేడు (12-07-2022)

కాజిపేట్ రైల్వే క్రూ కంట్రోల్ డిపో నుండి క్రూలింకులను విజయవాడకు తరలించడం, ప్రమోషన్ ల పేరుతో రైల్వే డ్రైవర్లు మరియు గార్డులను అక్రమ బదిలీలు చేయడాన్ని నిరసిస్తూ రైల్వే కార్మిక సంఘాలు చేస్తున్న న్యాయపోరాటాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇటీవల సంఘీభావం తెలియచేసి కాంగ్రెస్ పార్టీ ఉద్యమ నిర్మాణం చేస్తుంటే.. ప్రభుత్వం లో ఉండి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఉద్యమాన్ని నీరుగార్చేవిధంగా రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేయడం సిగ్గు చేటని హన్మకొండ & వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ. నాయిని రాజేందర్ రెడ్డి గారు తీవ్రంగా ఖండించారు.

కాజీపేట రైల్వే జంక్షన్ వెనుకబాటుకు అదేవిధంగా కాజీపేట ప్రాంతం వెనుకబాటుకు కారణం స్థానిక వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అని ఈ సందర్భంగా తెలియచేసారు. గత నాలుగు పర్యాయాలు స్థానిక ఎమ్మెల్యేగా ఉంటూ ప్రజా సమస్యల పైన, కాజీపేట బస్టాండ్ నుండి రైల్వే పరిశ్రమల విషయంలో ఉద్యమ నాయకుడినని చెప్పుకుంటూ, తెలంగాణ పేరుతో ఉద్యమ నాయకునిగా కాజీపేట జంక్షన్ ప్రాంత ప్రజలను మభ్యపెడుతూ కాలం గడిపి నేడు కాజీపేట రైల్వే గార్డులు, డ్రైవర్లు వారి క్రూ కంట్రోల్ కార్యాలయం ముందు గత పది రోజుల నుండి నిరసనలు ధర్నాలు మరియు రిలే నిరాహార దీక్షలు వారి కుటుంబ సభ్యులతో చేస్తుంటే ఎవరికీ చెవి పైన పేనుబారినట్టు లేకుండా, నిమ్మకు నీరెత్తినట్లు ఉండి, జిల్లా కాంగ్రెస్ పార్టీ వారి సమస్యల పట్ల చిత్తశుద్ధితో రైల్వే జంక్షన్ లోని క్రూ కంట్రోల్ కార్యాలయం ముందు డ్రైవర్లు, గార్డులు చేస్తున్న దీక్షలకు నా నాయకత్వంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ సంఘీభావం తెలియజేస్తే వెంటనే బిజెపి నాయకులు, టిఆర్ఎస్ స్థానిక ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ బెంబేలెత్తిపోయి పది రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చిన తర్వాత కనువిప్పైనట్లు వారి వద్దకు చేరుకొని మరొకసారి రైల్వే ఉద్యమాలను నీరుగార్చే విధంగా చేశారనడానికి నిదర్శనమే అని తెలియచేసారు. గత ఎనిమిది సంవత్సరాలు కేంద్రంలో బిజెపి మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో కేసీఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వం కాజీపేట రైల్వే జంక్షన్ పైన ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అనడానికి నిదర్శనం రాష్ట్ర విభజన చట్టంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణకి ఇస్తే, కాజీపేట జంక్షన్ లో 40ఏండ్ల కళ నెరవేర్చాలని, విభజన చట్టంలో ఏ ప్రభుత్వాలు వచ్చినా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఆరు నెలల్లో పనులు ప్రారంభించాలని పార్లమెంట్ సాక్షిగా చట్టం చేయబడి ఉంటే, టిఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక ఎంపీలు స్థానిక మంత్రులు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్ విఫలమయ్యారని ఆరోపించారు. కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము ఉత్తరాలు రాశామని బిజెపి ప్రభుత్వం ఇవ్వలేదని మాట చెప్పడమే తప్ప ఎన్నికల సందర్భంలో రాజకీయాలు చేయడం కోసం ఉద్యమాల పేరుతో రాజకీయ పబ్బం గడపడమే తప్ప వేరే లేదని తెలియచేసారు. 2014 కు ముందు కాజీపేట రైల్వే జంక్షన్ కు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం రైల్వే వాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రిపేర్ యూనిట్ ఇవ్వడం జరిగింది, ఈ వ్యాగన్ ఫ్యాక్టరీ కి మడికొండ శ్రీ. మెట్టు రామలింగేశ్వర ఆలయానికి చెందిన భూమిని 54 ఎకరాలు నాటి దేవాదాయశాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది, నాటి ముఖ్యమంత్రి శ్రీ. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ వ్యాగన్ ఫ్యాక్టరీ కి 18 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది, నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రాష్ట్ర ఏర్పాటు తదుపరి వచ్చిన ఎన్నికల సందర్భంగా వ్యాగన్ ఫ్యాక్టరీ శంకుస్థాపన వాయిదా పడ్డది, తెలంగాణ ప్రత్యేకరాష్ట్రం ఏర్పడ్డ తరువాత 2014 ఎన్నికల సందర్భంలో మడికొండ ఎన్నికల సభలో నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడుతూ మా ఎంపీ అభ్యర్థి కడియం శ్రీహరిని గెలిపించండి వ్యాగన్ ఫ్యాక్టరీ శంకుస్థాపన చేస్తామని నాడు ఎన్నికల వాగ్దానం చేయడం జరిగింది. 2014 లో రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీని తొక్కి పెట్టారని, రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన కాజిపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని తొక్కి పెట్టారని, కాజీపేట రైల్వే ప్రత్యేక డివిజన్ కేంద్రం చేయాలని డిమాండ్ కూడా తొక్కి పెట్టారని, దానికి నిదర్శనమే కాజీపేట ప్రాంతంలో ఉన్నటువంటి పలు రైల్వే విభాగాలన్నీ కూడా అంతర్గత కుట్రతో తరలించడం జరుగుతున్నదని, అందుకు నిదర్శనమే కాజీపేట క్రూ లింకులను విజయవాడకు తరలించడం, కుట్రపూరితంగా ప్రమోషన్ల పేరుతో డ్రైవర్లను, గార్డులను బదిలీలు చేయడం శోచనీయమని అన్నారు. బిజెపి మోడీ ప్రభుత్వం కాజీపేటకు రైల్వే పిరియాడికల్ ఓవరాయిలింగ్ వర్కుషాప్ మంజూరు చేసి నాలుగు సంవత్సరాలు అవుతున్నా పనులు నిమ్మకు నీరెత్తినట్టే ఉన్నాయని, ప్రజలు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే నాయకులను ఎన్నుకునే ముందు కాజీపేట ప్రాంత అభివృద్ధి కోసం పని చేస్తారా..! రైల్వే పరిశ్రమల కోసం పనిచేస్తారా.! లేదా పూర్తి పరిజ్ఞానం ఉందా.! అని గమనించాలని విజ్ఞప్తి చేసారు.
వరంగల్ పార్లమెంట్ సభ్యులు ఈ ప్రాంతానికి కాజీపేట రైల్వే జంక్షన్ కు ఎన్నిసార్లు వచ్చారు, ఎన్ని సమస్యల పైన మాట్లాడారు, కాజిపేట్ ప్రజలు గమనించాలని అన్నారు.

కాజిపేట్ రైల్వే క్రూ కంట్రోల్ కార్యాలయం ముందు డ్రైవర్లు, గార్డులు చేస్తున్నటువంటి న్యాయపోరాటానికి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు పూర్తిస్థాయిలో ఉద్యమ నిర్మాణం చేయమని ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. ఈ నెల 18 నుండి మొదలయ్యేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో మొట్టమొదలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ ఎంపీ మాణిక్ ఠాకూర్ గారి నాయకత్వంలో పార్లమెంట్ సాక్షిగా కాజిపేట్ రైల్వే డ్రైవర్లు, గార్డుల అక్రమ బదిలీలు విజయవాడకు తరలించిన క్రూ లింకులు వెనక్కి తీసుకొచ్చేంత వరకు ఉద్యమాన్ని ఉవ్వెత్తున పార్లమెంట్లో చర్చిస్తామని హామీ ఇచ్చారని, సికింద్రాబాద్ రైల్వే జీఎం మరియు డిఆర్ఎం లతో మాట్లాడారని వారు హామీ ఇచ్చారని తెలియచేసారు.

కాజీపేట క్రూ కంట్రోల్ కార్యాలయం నుండి విజయవాడకు తరలించిన క్రూ లింకులు అన్నిటిని కూడా వెనక్కి తీసుకొచ్చేంత వరకు, అక్రమంగా ప్రమోషన్ల పేరుతో కాజీపేట నుండి వివిధ ప్రాంతాలకు బదిలీలు చేసినటువంటి డ్రైవర్లు, గార్డులను వెనక్కి తీసుకొచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో ఉద్యమ నిర్మాణం చేస్తున్నామని, రాష్ట్ర విభజన చట్టంలోని కాజిపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ రిపేర్ యూనిట్ మరియు కాజీపేట జంక్షన్ ను రైల్వే ప్రత్యేక డివిజన్ హోదా సాధన కొరకు ఉద్యమిస్తామని, కాజీపేటకు మంజూరి అయి ఉన్నటువంటి రైల్వే వాగన్ పిరియాడికల్ ఓవరాయిలింగ్ వర్కుషాప్ ఏర్పాటు చేసేంతవరకు ఉద్యమిస్తామని తెలియచేసారు.

ఈ సమావేశంలో కార్పొరేటర్లు తోట వెంకన్న, పోతుల శ్రీమాన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ అంకూస్, ఎం.వీ సమతా రాజు, ఆరూరి సాంబయ్య, ఇప్ప శ్రీకాంత్, ఎస్కె అజ్గర్, పోగుల సంతోష్, పాలడుగుల ఆంజనేయులు, ఫ్రాన్సిస్ రెడ్డి, బుర్ర బాబు రావు, ఇన్నా రెడ్డి, నాగపురి రాంకీ గౌడ్, రంగు సుధీర్, కొండా శివ, క్రాంతి భరత్, బక్కతట్ల మోహన్ (టీంకు), ఎండీ. పాషా, బొల్లేపల్లి శేఖర్, ఎండీ ఆఫ్జాల్, ఎస్కె జాకీర్ హుస్సేన్, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.