టీఆరెఎస్ లో చేరిన కాంగ్రెస్ నేతలు

జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలం గొల్ల పల్లె కాంగ్రెస్ పార్టీ కి చెందిన మాజీ వార్డు సభ్యుడు చిన్న సోమయ్య, సీనియర్ నాయకులు బోండ్ల మారయ్య, బట్ట దుర్గయ్య, బొండ్ల నరేష్, బట్ట మధు, బట్ట గణేష్ తదితరులు రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో టీఆరెఎస్ లో చేరారు. వరంగల్ హన్మకొండ లోని మంత్రి క్యాంప్ కార్యాలయం లో గురువారం వారిని గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో సీఎం కెసీఆర్, నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై టీఆరెఎస్ లో చేరుతున్నామని వారు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కొత్తగా కాంగ్రెస్ నుంచి టీఆరెఎస్ లో చేరిన వాళ్లకు తగు గౌరవం, గుర్తింపు ఉంటుందన్నారు.

ఈ కార్యక్రమంలో ఆ గ్రామ మాజీ సర్పంచ్ ఆకవరం నర్సింహ రెడ్డి, సర్పంచ్ కోనేటి సుభాషిణి నర్సయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు తీగల సత్యనారాయణ, కార్యదర్శి బట్ట సైదులు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.