టెట్ అర్హత పరీక్షని వాయిదా వేయాలని కె.యూ లో నిరసన

ఈ నెల 12వ తేదీన జరగబోయే టెట్ పరీక్ష ను వాయిదా వేయాలని బహుజన విద్యార్థి సంఘం(బి.యస్.ఫ్),టి.యస్ .డి.యస్.ఏ,పి.డి.యస్.యూ ఆధ్వర్యంలో కె.యూ ప్రధాన గ్రంధాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా బి.యస్.ఫ్ కె.యూ ఇంచార్జి, హన్మకొండ జిల్లా అధ్యక్షులు బొట్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ర్ట ప్రభుత్వం ఈ నెల 12తేదీన నిర్వహించబోయే టెట్ పరీక్ష ను వాయిదా వేయాలని ఎందుకంటే అదే రోజు కేంద్రం నిర్వహించే రైల్వే ఆర్.ఆర్.బి పరీక్ష వున్నదని దాని ద్వారా విద్యార్థులు నిరుద్యోగులు నష్టపోతారని అన్నారు.అలాగే దానికి తోడు తెలుగు అకాడమీ బుక్స్ కూడా అందుబాటులో లేవు,తెలుగు మీడియం అభ్యర్థులకు తెలుగు మాధ్యమ పుస్తకాలు కూడా అందుబాటులో లేవని యస్.సి మరియు బి.సి స్టడీ సర్కిల్ లో ఇప్పటికి సిలబస్ కూడా పూర్తి కాలేదు అని బయోలాజికల్ సైన్స్ అభ్యర్థులు నాన్ మ్యాథ్స్ గ్రూప్ కి చెందటం వల్ల టెట్ రెండవ పేపర్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ పూర్తి స్థాయిలో ప్రిపేర్ అవడానికి సమయము సరిపోవట్లేదు టెట్ లో ఇరవై మార్కులు వెయిటేజ్ ఉన్నందున అర మార్క్ తో కూడా జాబ్ కోల్పోయే ప్రమాదం ఉన్నందున టెట్ పూర్తి స్థాయిలో ప్రిపేర్ అవడానిక సమయం అవసరం కావున టెట్ పరీక్ష ను వాయిదా వేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో టి.యస్.డి.ఎస్. ఏ రాష్ట్ర కన్వీనర్ అరేపెళ్లి క్రాంతి కిరణ్,పి.డి.యస్.యూ కె.యూ కార్యదర్శి కొటేశ్వర్ గౌడ్,నాయకులు శంకర్,అశోక్,అరవింద్,రాజు కుమార్,శ్రీకాంత్, శివ,రమేష్ తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.