క్రీడలు మానసిక ఉల్లాసాన్ని,ఆనందాన్ని కలిగిస్తాయి గండ్ర

ప్రతి ఒక్కరూ ఒక్క సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్ లా తయారు కావాలిగండ్ర

ఈ రోజు టేకుమట్ల మండల కేంద్రంలో జి ఎం ర్ ఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భూపాలపల్లి నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన మన ప్రియతమ నాయకులు భూపాలపల్లి శాసన సభ సభ్యులు గౌరవ గండ్ర వెంకట రమణా రెడ్డి

ఈ కార్యక్రమంలో గండ్ర మాట్లాడుతూ…..

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని,ఆనందాన్ని కలిగిస్తాయన్నారు.

ప్రతి ఒక్కరూ చదువుతో పాటు ప్రతి ఒక్కరూ ఎదో ఒక్క క్రీడా పోటీలలో ముందుకెళ్లాలని తెలిపారు.

క్రీడలు శారీరక, మానసిక దృఢత్వం తో పాటు ఉద్యోగ పోటీ పరీక్షలో ఉద్యోగ సాధనలో తోడ్పాటు ఉంటుంది అని అన్నారు.

ప్రతి ఒక్కరూ ఒక్క సచిన్ టెండూల్కర్ లా,సునీల్ గవాస్కర్ లా ప్రతి ఒక్కరూ పేరు ప్రఖ్యాతలు సాధించాలని కోరారు.

ప్రతి ఒక్కరూ దేశానికి, తల్లితండ్రులకు,పుట్టిన ఊరికి గొప్ప పేరు తీసుకురావాలని క్రీడాకారులను కోరారు.

ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని,స్నేహభావంను కలిగి ఉండాలని కోరారు.

అదే విధంగా క్రీడలో గెలుపు ఓటములు అనేవి సహజం అల అని గెలిచిన వారు గర్వంతో ఉండవద్దని, ఓడిన వారు నిరుత్సాహ పడవద్దని దైర్యంగా ఉండి మరింత ఉత్సహంగా ముందుకెళ్లాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో చెల్పూర్ , ఓడితల టీమ్ లతో ఎమ్మెల్యే టాస్ వేసి టోర్నమెంట్ ప్రారంభించారు.

ఈ క్రికెట్ టోర్నమెంట్లో మొత్తం 60 టీమ్ లు తలపడనున్నాయి అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి మల్లా రెడ్డి,మండల పార్టీ ప్రెసిడెంట్ సట్ల రవి,సర్పంచ్ సర్రోత్తం రెడ్డి,ఎంపీటీసీ ఆది సునీత రఘు,గ్రామ శాఖ అధ్యక్షులు సరోతమ్ రెడ్డి మరియు GMRM ట్రస్ట్ సీఈఓ గండ్ర గౌతమ్ రెడ్డి, మరియు వివిధ గ్రామాల సర్పంచ్లు,ఎంపీటీసీలు,గ్రామ శాఖ అధ్యక్షులు,మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు,యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.