వీరులపాడు మండలం ఏప్రిల్ 5:(ఆంధ్ర పత్రిక)వీరు లపాడు మండలం పెద్దాపురం గ్రామ శివారులో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో నిప్పుల పల్లి లక్ష్మణరావు (35) అక్కడికక్కడే మృతి.
మృతునికి భార్య కుమారుడు కుమార్తె ఉన్నారు.
విషయం తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ కోటేరు ముత్తరెడ్డి, జిల్లా కార్యదర్శి ఆవు ల రమేష్ బాబు , ఎంపీటీసీ అభ్యర్థిని కోటేరులక్ష్మి, మాజీ సర్పంచ్ ఆవుల మాధవి మృతుని ఇంటికి వెళ్లి కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు.
మృతుని కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని సంక్షేమ పథకాలు వచ్చే విధంగా చేయడం జరుగుతుందని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు.