ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రము లో గల స్థానిక మార్కెట్ యార్డులో సహారా జీప్ డ్రైవర్స్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అబ్దుల్ పాషా ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.. ట్రాఫిక్ నియమాలు పాటించాలని, ప్రతి డ్రైవర్ విధిగా యూనిఫాం ధరించాలని, వాహనం నడిపేటప్పుడు మద్యం సేవించవద్దని, మొబైల్ మాట్లాడవద్దని,ప్రయాణికుల ను ఎంత జాగ్రత్తగా వారి వారి గమ్యస్థానాలకు తీసుకు వెళితే వారు మనల్ని ఆదరిస్తారని కాబట్టి ప్రతి ఒక్క డ్రైవర్ విధిగా నియమాలు పాటించాలి అని అడ్డా డ్రైవర్స్ కు అవగాహన కల్పించిన సహారా జీప్ డ్రైవర్స్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అబ్దుల్ పాషా…అనంతరం తమ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు వాగ్మారే చరణ్, సలహా దారుడు మల్యాల భూమేష్, కార్యదర్శి చాహకటి కృష్ణ ,కోశాధికారి పయ్యా ఖాన్,సభ్యులతో కలిసి డ్రైవర్లకు యూనిఫామ్,5 లక్షల ప్రమాద బీమా కార్డులను పంపిణీ చేశారు…