అది సూర్యాపేట కొత్త బస్టాండ్ ఉదయం 10:00 ఫ్లైఓవర్ కింద రద్దీగా ఉండే ప్రాంతం ఒక పండు ముదుసలి ఫ్లైఓవర్ అవతలినుండి కొత్త బస్టాండ్ వైపు రావడానికి నానా ఇబ్బందులు పడుతోంది పైగా ఆమె తన రెండు మోకాళ్లు రెండు చేతులతో రోడ్డుపై నడుచుకుంటూ రోడ్డు దాటాలి అరగంటసేపు నానా యాతన పడిన రోడ్డు దాటడం చాలా కష్టమైంది, ఇది అటువైపు ట్రాఫిక్ డ్యూటీ చేస్తున్న ట్రాఫిక్ హోంగార్డు మెట్టు సునీల్ రెడ్డి గమనించి రెండు వైపులా ట్రాఫిక్ ను ఆపి అమాంతం ముదుసలి ని తన చేతులతో ఎత్తు కో పోయాడు దీనికి ఆ ముసలి ససేమిరా ఒప్పోక తన రెండు మోకాలు చేతుల పైన నడుచుకుంటూ రోడ్డు దాటు తానని చెప్పింది, హోం గార్డ్ సునీల్ రెడ్డి వాహనాలకు అడ్డుగా ఉండి ఆమెను క్షేమంగా రోడ్డు దాటడానికి సహాయపడ్డాడు.