డంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా వాహనాలను తనిఖీ చేసిన ఎస్సై శ్రీధర్

డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా మొగుళ్లపల్లి మండలంలోని ములకలపల్లి గ్రామ శివారులో ఎస్ ఐ జె శ్రీధర్ నేతృత్వంలో శనివారం రోజున పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తూ..డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు వాహనాలకు సంబంధించిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై జె శ్రీధర్ మాట్లాడుతూ ప్రస్తుతం యువత మద్యం సేవించి వాహనాలను నడిపినట్లయితే యాక్సిడెంట్లు అధికమవుతున్నాయని, దీంతో అనేక మంది యువకులు ప్రాణాలు కోల్పోతున్నందున వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయని, మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. అదేవిధంగా వాహనాలకు సంబంధించిన పేపర్లను, సంబంధించిన లైసెన్సులను క్షుణ్నంగా పరిశీలించి, సరైన పత్రాలు లేని వారికి ఫైన్ విధించారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.