Latest News, Videos and Photos of Jangaon

జూలకంటి రంగారెడ్డి
EX.MLA. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు
జనగామ : పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వకపోతే ఓట్లేసిన ప్రజలే ఇంటికి పంపుతారు ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి హెచ్చరించారు.———
—బుధవారం రోజున పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మూడో విడత ఇందిరమ్మ డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ధర్నా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగింది జోగు ప్రకాష్ సిపిఎం పట్టణ కార్యదర్శి అధ్యక్షత వహించగా దీనికి ముఖ్య అతిథిగా ఎక్స్ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి హాజరై మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల వాగ్దానం లో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వలేదు అన్నారు టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న పనికి చెప్పిన దానికి చాలా తేడాలు ఉన్నాయి అన్నారు ముఖ్యంగా జనగామ జిల్లా కేంద్రంలో గత ప్రభుత్వం 2012వ సంవత్సరంలో 1147 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది కానీ స్థలాలు చూపించలేదు టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తామని చెప్పడం జరిగింది జనగామ పట్టణంలో గత నాలుగు సంవత్సరాల క్రితం చిన్న ఇల్లు నిర్మించుకుని ఉన్నా పేదల దగ్గరికి జనగామ ఎమ్మెల్యే గారు జిల్లా కలెక్టర్ గారు లబ్ధిదారుల దగ్గరికి వచ్చి సంవత్సరం లోపల ఇండ్లు నిర్మించి ఇస్తాము అని చెప్పడం జరిగింది దీన్ని విశ్వసించగా ప్రజలు మిమ్ములను ఇండ్లలోకి పంపిస్తామని చెప్పడం జరిగింది సిమెంటు ఐరన్ ధరలు పెరిగి కాంట్రాక్టర్లు పనిచేయడం లేదు కాబట్టి ఇండ్లు గోడలు గానే మిగిలి పోతున్నాయి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు పేదలు కరోనా కారణంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు రూము కిరాయల్ పెరిగి కట్టలేని పరిస్థితిలో ఉన్నారు ఎవరైనా చనిపోతే రోడ్ల మీద వేసుకుని దహనం చేసుకుంటున్నారు చల అవమానాలకు గురైతున్నారు కాబట్టి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తిచేసి లబ్ధిదారులకు అప్పగించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ. అబ్బాస్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర సరుకుల ధరలు పెంచి ప్రజలపై భారాలు వేస్తున్నారు దీని ఫలితంగా ఇండ్ల కిరాయి కట్టలేక ప్రజలు అవస్థలు పడుతున్నారు ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రజా సమస్యలు పరిష్కరించాలని లేనిచో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు
అనంతరం
— అదనపు జిల్లా కలెక్టర్ భాస్కర్ రావు గారికి వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందించాం కలెక్టర్ గారు మాట్లాడుతూ పని ప్రారంభిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనక రెడ్డి . జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏదోనూరి వెంకటరాజం. ఇర్రి అహల్య. సీనియర్ నాయకులు బోట్ల శ్రీనివాస్ జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి. పోతుకునూరి ఉపేందర్. బోడ నరేందర్. ఎండీ. అజారుద్దీన్ భూక్య చందు నాయక్. ఇందిరమ్మ ఇళ్ల అధ్యక్ష కార్యదర్శులు కళ్యాణం లింగం. ఎండీ. గౌసియా టౌన్ కమిటీ సభ్యులు. బాలే వెంకట మల్లయ్య. దూసరి నాగరాజు. భాష పాక విష్ణు. మారెడ్డి వినోద్. గంగ బోయిన మల్లేష్ రాజ్ .P. కనుకచారి.. కొన్ని శాంత. పొన్నాల ఉమా. జయ. శశిరేఖ. సంతోష. కమల. తబస్సుమ్. మనీ. భూనాద్రి వెంకట్. టాక్ ఆనంద్ కౌర్. T.గంగాకౌర్. తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.