డబల్ బెడ్ రూమ్ లు తక్షణమే కేటాయించాలి సిపిఎం జూబ్లీహిల్స్ జోన్ కన్వీనర్

యూసఫ్ గూడా డివిజన్ కృష్ణానగర్ లో జరిగిన మీటింగ్ లో మాట్లాడుతూ డబల్ బెడ్ రూమ్ ఇండ్ల దరఖాస్తులను పరిశీలన చేసి లబ్ధిదారులను తక్షణమే గుర్తించి బస్తీల్లోని ఇల్లు లేని వారందరికీ తక్షణమే డబల్ బెడ్ రూమ్ లు కేటాయించాలని డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 1 తేదీ సోమవారం నాడు ఖైరతాబాద్ ఎమ్మార్వో ఆఫీస్ ముందు ధర్నా చేస్తామని తెలపడం జరిగింది. వివిధ బస్తీల్లో ఉండే ప్రజలు డబల్ బెడ్ రూమ్ ల కోసం ఎనిమిది సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారని ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఎవరికీ ఇల్లు కట్టి ఇవ్వలేదని వెంటనే కట్టిన ఇళ్లను ఇవ్వాలని తెలపడం జరిగింది. స్థలము ఉండి ఇల్లు కట్టుకునే వారందరికీ పది లక్షల ఇవ్వాలని డిమాండ్ చేశారు. దరఖాస్తు చేసుకోవడానికి మళ్లీ అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ సమస్యల పరిష్కారం కోసం జరిగే ధర్నాలో ఇల్లు లేని వారు పాల్గొని ఈ ధర్నాను విజయవంతం చేయాల్సిందిగా పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రఘు, నాయుడు, సుమను, తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.