డాక్టర్ నాగార్జున రెడ్డి సేవలు శ్లాఘనీయం

నయీంనగర్: డాక్టర్ నాగార్జున రెడ్డి సేవలు శ్లాఘనీయం అన్నారు జాతీయ అవార్డు గ్రహీత పరికిపండ్ల వేణు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా “జిల్లా స్థాయి ఉత్తమ వైద్య అధికారి” గా అవార్డు అందుకున్న డా.నాగార్జునరెడ్డికి ఆదివారం నాడు హనుమకొండలోని ఆదర్శ కాలనీలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సన్మాన కార్యక్రమం దొండపాటి వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగినది. ఈ సమావేశంలో వేణు మాట్లాడుతూ కోవిడ్ పాండమిక్ సమయంలో ఎం.జీ.ఎం సూపరిండేంట్ గా పదవీ బాధ్యతలు చేపట్టి సామాన్య ప్రజలకు వారు అందించిన సేవలు వెలకట్టలేనివన్నారు.వారు మన ఆదర్షకాలని వాసులుకావడం గర్వించదగ్గ విషయం అన్నారు. ఈ సందర్భంగా సన్మానగ్రహిత నాగార్జున్ రెడ్డి మాట్లాడుతూఎంజీఎం సిబ్బంది సహాయ సహకారాలు,తోడ్పాటుతో నేను ఈ విజయాన్ని సాధించగలిగానన్నారు.త్వరలో ఆదర్శ కాలనీ, సమ్మయ్యనగర్ ఏరియాలో శరణ్య హాస్పటల్ ఆధ్వర్యంలో “ఉచిత వైద్య శిబిరాన్ని” ఏర్పాటు చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ బాధ్యులు కుమారస్వామి, సుందర్ రావు, ఇంద్రసేనారెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, నరసింహస్వామి,సంజీవరెడ్డి, రాంరెడ్డి, శ్రీను, వినోదరావు, హరిత,స్వప్న తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.