డిక్షనరీలను పంపిణి చేసిన ... గండ్ర దంపతులు

ఈ రోజు మొగుళ్ళపల్లి మండలం, పిడిసిల్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఏర్పాటు చేసిన 10 వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు గ్రామ సర్పంచ్ నైనకంటి ప్రభాకర్ గారి తండ్రి గారి జ్ఞాపకార్థం అందిస్తున్న ఇంగ్లీష్ డిక్షనరీలను భూపాలపల్లి శాసన సభ సభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి మరియు వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ ఛైర్పర్సన్ & భూపాలపల్లి జిల్లా తెరాస పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గండ్ర జ్యోతి రెడ్డి చేతుల మీదుగా విద్యార్థిని విద్యార్థులకు అందచేశారు.
అనంతరం గౌరవ ఎమిలీ పి. ఆర్.ఆర్ క్రియేషన్స్ పతాకంపై సీనియర్ జర్నలిస్ట్ రాళ్ళబండి శ్రీనివాస్ దర్శకత్వంలో నిర్మిస్తున్న “మహానుభావుడు” మినీ చిత్రానికీ క్లాప్ కొట్టి దర్శకత్వం వహించగా, గౌరవ జడ్పీ ఛైర్పర్సన్ గారు కెమెరా స్విచ్ ఆన్ చేసి చిత్ర షూటింగ్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో గండ్ర మాట్లాడుతూ….
అక్షర,ఆకాంక్ష ఇద్దరు కూడా మరి వైద్యవృత్తిని అభ్యసించాలని అనుకునే సందర్భంలో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను అధిగమించడానికి ఆర్థిక సహకారాన్ని అందించిన అటువంటి గొప్ప మనసు కలిగినటువంటి నాయకుడు కల్వకుంట్ల తారక రామారావు గారు.
అయితే అదే విధంగా చాలామందికి మన జిల్లాలో ఉన్నటువంటి ఒక పేద విద్యార్థి ఆలిండియా మెడికల్ సైన్స్ లో సీటు వచ్చింది అని తెలిసినప్పుడు ఆ రోజు మేము కూడా కొంత ఆర్థిక సహకారం అందించడం మరియు అదే విధంగా కేటీఆర్ సోషల్ మీడియా ద్వారా తెలుసుకుని నన్ను పిలిచి ఆ అబ్బాయి కూడా ఆర్థిక సహకారం అందించడం జరిగింది.
ఈ రోజు సోషల్ మీడియా ద్వారా ఎక్కడ అనారోగ్యం బారినపడ్డ లేదా పేదరికం ద్వారా పేదరికంగా ఉండి ఆర్ధిక సహాయం కొరకు ఎదురుచూసే వారికి పెద్ద మొత్తంలో ఆర్ధిక సహాయం చేసిన ఘనత కేటీఆర్ చెందుతుంది.
నిజంగా కేటీఆర్ గారు ఒక గొప్ప వ్యక్తి మరి నిజంగా గొప్ప వ్యక్తిత్వం ఉన్న “మహానుభావుడు” అని తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తూ మరియు పార్టీని ప్రగతి పథంలో నడిపిస్తూ ఈరోజు సమాజహితం కొరకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నటువంటి అలాంటి వ్యక్తి మీద ఈరోజు ఒక చిన్న సినిమాను మా రాళ్ళబండి శ్రీనివాస్ ఎంతో ఆలోచించి ఈ చిత్రాన్ని తీయడం నిజంగా ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్న అంశం.మరి శ్రీనివాస్ గారు నేను కూడా శాసనసభ్యుడిగా చేస్తున్నటువంటి సేవలను దృష్టిలో పెట్టుకుని ఈ మధ్యకాలంలో నాపై ఒక్క మంచి పుస్తకాన్ని రచించి, ప్రచురించడం జరిగింది, వారికి వ్యక్తిగతంగా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.పి.ఆర్.ఆర్ క్రియేషన్స్ పతాకం పై ఇంకా ఎన్నో మంచి చిత్రాలను నిర్మించాలని మనస్ఫూర్తి గా కోరుకుంటూ మమ్మల్ని ఈ కార్యక్రమంలో బాగస్వాములను చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ, జడ్పీటీసీ, మండల పార్టీ ప్రెసిడెంట్,PACS చైర్మన్, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు,మండల ముఖ్య నాయకులు,కార్యకర్తలు,చిత్ర బృందం తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.