జక వృత్తిదారుల సంఘం పిలుపు

గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ పరిధిలో ఉన్నరజక వృత్తిదారులు ఈ నెల 12న జరిగే రాష్ట్ర సదస్సుకు హాజరై జయప్రదం చేయాలని గోల్కొండ చౌరస్తా ముషీరాబాద్ లో జరిగిన రజక సంఘం జిల్లా సమావేశంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి పి ఆశయ్య పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా జిల్లా కమిటీ సమావేశం ఆయన మాట్లాడుతూ సంగం ఏర్పడి 20 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా డిసెంబర్ 12 ,13 తేదీలలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే వృత్తి ఆధునీకరణ –ఉపాధికల్పన అంశంపై రాష్ట్ర సదస్సు నిర్వహిస్తామని రాష్ట్ర వ్యాప్తంగా 500 మంది ప్రతినిధులు హాజరవుతారని, అధికారులు, మేధావులు ,ప్రజా ప్రతినిధులు హాజరవుతున్నారు .వివిధ అంశాలపై ప్రసంగ ఉంటుంది . రజక వృత్తిదారుల అందరూ పెద్ద సంఖ్యలో హాజరై సదస్సును జయప్రదం చేయాలని కోరినారు.సంగం *నగర అ అధ్యక్షులు చారగొండ వెంకటస్వామి,* *ప్రధాన కార్యదర్శి గుమ్మడి రాజు నరేష్, మాట్లాడుతూ తెలంగాణ రజక సంఘం వార్షికోత్సవ సందర్భంగా వృత్తి ఆధునీకరణ- ఉపాధికల్పన పేరుతో రాష్ట్ర సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఈ సదస్సులో ఉచిత విద్యుత్ పథకం, మరియు జీవిత బీమా, పెన్షన్, డ్రై క్లీనింగ్ మిషన్స్ తదితర అంశాలపై సంక్షేమ పథకాల పై చర్చ, ఉంటుంది.కావున సభ్యులందరూ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఈ సమావేశంలో సోమయ్య, నరసయ్య ,రాము, లక్ష్మణ్, లక్ష్మణ్, దర్గయ్య, తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.