డి.ఎల్.సి మీటింగ్ కు హాజరైన సీతక్క

ఈ రోజు ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం జరిగిన డి.ఎల్.సి మీటింగ్ కు హాజరైన ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ సందర్భంగా మాట్లాడుతూ
వర్షాలు పడుతే బొగ్గుల వాగు నుండి వరద నీరు లక్నవరం సరస్సు నిండుతుంది. ఈ చెరువు ముందు 7 గిరిజన గ్రామాలకు యాసింగి పంట పండదు. వర్ష కాలం లక్నవరం సరస్సు ముందు ఉన్న పొలాలు నీట మునుగుతుంది. బొగ్గుల వాగులో చెక్క డ్యామ్ లు ఉంటే 3వేల ఎకరాలకు నీరు అందుతుంది.
అదే విధంగా దేవాదుల ప్రాజెక్టు ద్వారా పాకాల చెరువు నింపి పక్కనే ఉన్న కొత్త గూడ గంగారాం మండలాలకు సాగు నీరు అందించాలని అదే విధంగా వెంకటా పూర్ మండలం లోని ఇంచెన్ చెరువు క్రింద పెద్ద అయా కట్టు ఉందని కావున ఇంచేన్ చెరువు లో లిఫ్ట్ ఎర్పాటు చేయాలని సీతక్క గారు అన్నారు
అనంతరం తాడ్వాయి మండలం లోని గుండాలలో ఇటీవలే ప్రమాద వ శతు 4 ఇల్లు దగ్ధం కాగా వారి కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 25000 వేల రూపాయల చెక్కును లబ్ది దారులకు అందించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క మరియు ఐ.టి.డి. ఎ డి,టి,డి,ఓ మంకిడి ఏర్రయ్య తదితరులు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.