డీడీ తీసిన వారికి గొర్రెలు పంపిణీ చేయాలని ధర్నా

తెలంగాణ గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం ఆధ్వర్యంలో సిరిపురం లో ని పశు వైద్య శాల ముందు ధర్నా నిర్వహించి.వినతి పత్రం అందజేశారు.అనంతరం సంఘం జిల్లా గౌరాధ్యక్షుడు,జిల్లా కార్యదర్శి చింతలచేరువు కోటేశ్వర రావు, మేకల నాగేశ్వర రావు లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కురుమ, యాదవుల ను ఆర్థికంగా అభివృద్ధి చేస్తానని చెప్పి. గొర్రెల కోసం డీడీ లు కట్టి రెండు సంవత్సారాలు అయిన గొర్రెలు పంపిణీ చేయలేదని ఆవేదన వ్యక్తంచేశారు. అప్పులు చేసి మరీ డీడీ లు కట్టినవారు వడ్డీలు కట్టలేక అప్పులపాలవ్తున్నరు.ప్రభుత్వం కురుమ యాదవుల కు వెంటనే గొర్రెలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు ch.నాగేశ్వర రావు, రోశయ్య, సంపసా నీ గోపాలరావు, సంప సాని నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.