ఢిల్లీలో కిసాన్ గణతంత్ర పరేడ్ కు మద్దతుగా ట్రాక్టర్, బైక్ ర్యాలీ

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 3 వ్యవసాయ వ్యతిరేఖ చట్టాలను ఉపసంహరించుకోవాలని, గిట్టుబాటు ధరల గ్యారంటీ కోసం చట్టం చేయాలని రైతు సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీలో రైతులు కిసాన్ గణతంత్ర పరేడ్ ట్రాక్టర్లతో నిర్వహిస్తుంటే ప్రభుత్వం అమానుషంగా పోలీసులతో లాఠీచార్జ్ చేసి రైతులను కొట్టించడం దుర్మార్గమని, దీనిని ఖండిస్తూ రేపు జిల్లా వ్యాప్తంగా రైతు, ప్రజాసంఘాలతో నిరసనలు చేస్తామని రైతు సంఘం రాష్ట్ర నాయకులు Ch.రాజారెడ్డి, మోకు కనకారెడ్డి పిలుపునిచ్చారు.

దివి: 26-01-2021 మంగళవారం రోజున జిల్లా రైతు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రైతు సంఘం జిల్లా భాద్యులు R.మీట్యానాయక్ అధ్యక్షతన ఢిల్లీలో సాగుచట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు నిర్వహిస్తున్న కిసాన్ గణతంత్ర పరేడ్ ట్రాక్టర్ ర్యాలీకి మద్దతుగా జిల్లా పట్టణ కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం నుండి ప్రధాన రహదారిగుండా నెహ్రూపార్క్ మీదుగా ప్లైఓవర్ గుండా జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ట్రాక్టర్లతో, బైకులతో పెద్ద ఎత్తున రైతుసంఘాల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు, రైతులు, వివిధ రంగాల కార్మికులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొని మోడీకి వ్యతిరేకంగా నినాదాలుచేస్తూ ర్యాలీ నిర్వహించగా ఈ కార్యక్రమంలో రైతు సంఘాల రాష్ట్ర నాయకులు Ch.రాజారెడ్డి, మోకు కనకారెడ్డి ముఖ్య అతిధులుగా పాల్గొని మాట్లాడుతూ సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతు సంఘాలు నిర్వహిస్తున్న కిసాన్ గణతంత్ర పరేడ్ సందర్బంగా రైతులు సింఘి, టిక్రి, ఘాజీపూర్ సరిహద్దుల నుంచి బయలుదేరిన రైతులకు కాసేపటికే పలుచోట్ల ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. వివిధ ప్రాంతాలలో రైతులను పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. సిక్రి సరిహద్దు వద్ద ట్రాక్టర్లతో వచ్చిన రైతులపై పోలీసులు లాఠీలు, కర్రలతో కొట్టి, టియర్ గ్యాస్ ప్రయోగించిన మోడీ సర్కార్ ఎంత దుర్మార్గం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ లాఠీఛార్జిని ఖండిస్తూ రేపు (27-01-2021న) జిల్లా వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తామని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయని, దేశాన్ని మతాల పేరుతో విభజించే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. రైతులు రోడ్లపైకి వచ్చి రాత్రిoబవళ్ళు ఆందోళనలు చేస్తున్న కేంద్రానికి చీమకుట్టినట్లైనా లేకపోవడం దురదుష్టకరమని విమర్శించారు. దేశ వ్యవసాయ రంగాన్ని, రైతు ఉనికిని దెబ్బతీసే వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని, గిట్టుబాటు ధరల గ్యారంటీ కోసం చట్టం చేయాలని 2 నెలలుగా సాగుతున్న పోరాటాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గం అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 చట్టాల వల్ల రైతులు హక్కుగా పొందుతున్న (MSP) మద్దతు ధర రద్దవుతుందని అన్నారు. పంటల ధరలు తగ్గితే ప్రభుత్వం మార్కెట్ లో కొనుగోలు చేయదని తెలిపారు. స్వదేశీ, విదేశీ కార్పొరేట్ కంపెనీలు కాంట్రాక్టు వ్యవసాయం చేపట్టి రైతులపైన, వారి భూములపైన ఆధిపత్యం వహిస్తాయని అన్నారు. రైతుల నుండి కారుచౌకగా వ్యవసాయోత్పత్తులను కొని వినియోగదారులపై భారంమోపి అధికలాభాలను కోళ్ల గొడతారని తెలిపారు. రైతులు అప్పులపాలై, దివాళాతీసి ఆత్మహత్యలు ఇంకా పెరుగుతాయని అన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థ బహినపడుతుందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయని దీనివల్ల ప్రజలకు తినడానికి తిండికూడా కరువవుతుందన్నారు. కార్మికులు, ఉద్యోగులపై ధరల భారం పడుతుందని, ఇది ఆకలి చావులకు దారి తీస్తుందని అన్నారు. ఈ చట్టాల పర్యవసానంగా రైతులు భూములు కోల్పోతారని, కౌలు రైతులకు చేసుకోవడానికి భూములు దొరకవని అన్నారు. వ్యవసాయ చట్టాలు కొనసాగడమంటే భారతదేశ ఆర్ధిక వ్యవస్థను కొద్దిమంది కొల్లగొట్టడమేనన్నారు. వ్యవసాయం, విద్య, విద్యుత్ లపై చట్టాలు చేసే హక్కు రాష్ట్రాలది, కానీ ఈ కొత్త చట్టాలతో కేంద్రం రాష్ట్రాల హక్కుల్ని హరించిందన్నారు. కేంద్ర BJP రాజ్యసభలో ప్రజాస్వామ్యం గొంతు నులిమి ఈచట్టాలను ఆమోదింపచేసుకుందన్నారు. పార్లమెంట్ సభ్యులకు చర్చించడానికి కూడా అవకాశం ఇవ్వలేదని, కరోనా కష్టకాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే వాటిని పట్టించుకోకుండా దొడ్డిదారిన ఈచట్టాలకు ఆర్డినెన్సులను తెచ్చిందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతు సంఘాల నాయకులతో చర్చించి ఈచట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఢిల్లీలో రైతులు చేస్తున్న దీక్షలకు, పోరాటాలకు మద్దతుగా ఉంటూ రాష్ట్ర వ్యాప్తంగా రైతు, ప్రజాసంఘాలు, కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలను సమీకరించి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎదునూరి వెంకట్రాజం, మహిళా సంఘం జిల్లా కార్యదర్శి ఇర్రి అహల్య, కల్లుగీతకార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బూడిది గోపి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆదిసాయన్న, KVPS జిల్లా కార్యదర్శి బోట్ల శేఖర్, SFI జిల్లా కార్యదర్శి బోడ నరేందర్, NPRD జిల్లా కార్యదర్శి బిట్ల గణేష్, CITU పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి B.చందు నాయక్, మత్స్య కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పంపర మల్లేశం, KGKS జిల్లా కార్యదర్శి బాల్నే వెంకటమల్లయ్య, ఆవాజ్ జిల్లా నాయకులు MD.అజారోద్దిన్, Sfi జిల్లా నాయకులు దడిగే సందీప్, DYFI పట్టణ కార్యదర్శి బోట్ల శ్రావణ్ లతోపాటు రైతులు, కార్మికులు, విద్యార్థులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.