ఢిల్లీలో రైతుల ధర్నాకు మద్దతు తెలిపిన సిద్దిపేట జిల్లా యుఎస్ఎఫ్ఐ నాయకులు *వెంటనే రైతుల సమస్యను పరిష్కరించాలి


-USFI డిమాండ్
భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్(USFI) సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీలో రైతులు చేస్తున్న నూతన వ్యవసాయ బిల్లు వ్యతిరేక పోరాటానికి మద్దతుగా సిద్దిపేటలోని అంబెడ్కర్ చమాన్ లో ప్లకార్డులతో మద్దతు తెలియజేసారు.
ఈ సందర్భంగా USFI సిద్దిపేట జిల్లా అధ్యక్షకార్యదర్శులు గుడికందుల రవి, చంద్లాపురం మధు మాట్లాడుతూ బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టినుంచి గతంలో తమిళనాడు రైతులు,ఇప్పుడు పంజాబ్,హర్యానా రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీలో నిరసనలు చేస్తున్నారు. ఈ పెట్టుబడిదారుల బానిస అయిన BJP మాత్రం వారి సమస్యను కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. నేడు రైతులు చేస్తున్న పోరాటానికి ప్రపంచ వ్యాప్తంగా మద్ధతు వస్తున్న, మోదీ మాత్రం ఏం పట్టనట్టు ఉండడం సరికాదు. వెంటనే నూతన వ్యవసాయ బిల్లు ను రద్దు చేయాలి. లేనిపక్షంలో విద్యార్థి,యువజన,కార్మిక,రైతాంగం కలిసి పోరాడితే కేంద్ర ప్రభుత్వ ఆనవాళ్లు కూడా కనిపించవని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో USFI జిల్లా సోషల్ మీడియా ఇంచార్జి భార్గవ్ రెడ్డి, నాయకులు రవి,లక్కీ,కిరణ్,మహేష్ తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.