ఢిల్లీ రైతుల పోరాటానికి మద్దతుగా ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

ఢిల్లీ రైతుల పోరాటానికి మద్దతుగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలనిసిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్యాల సొమన్నడిమాండ్ చేశారు, శనివారం స్థానిక పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు, ఈ సందర్భంగా సోమన్న పాల్గొని మాట్లాడుతూ,గత వారం రోజులుగా రైతు సంఘాలు రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు, దేశ వ్యవసాయ రంగం దివాలా తీసే పద్ధతిలో మూడు రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి రైతులను మోసం చేస్తోందని మండిపడ్డారు, దీని ఫలితంగా వ్యవసాయ రంగం దివాలా తీయడంతో పాటు దేశ ప్రజలకు ఆహార భద్రతకు ముప్పు వస్తుందని కార్పొరేట్ శక్తులకు లాభాలు చేకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలను చేయడం సిగ్గుచేటన్నారు ,ఇప్పటికైనా చట్టాలను రద్దు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు సోమ అశోక్బాబు, మాసంపల్లి నాగయ్య, నక్క యాదగిరి, దండు కృష్ణ, శోభన్, తదితరులు పాల్గొన్నారు,

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.