మరిపెడ మండలం తండ ధర్మారం గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ షిరిడీ సాయిబాబా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డోర్నకల్ శాసనసభ్యులు శ్రీ డి.యస్ రెడ్యానాయక్ ,జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ శ్రీ గుడిపుడి నవీన్ రావు ప్రారంబించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ప్రతీ ధాన్యపు గింజను కొనుగోలు చేస్తుందన్నారు.కేంద్ర బీజేపీ ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యాన్ని కొనమని చెప్పినా,ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రైతులకు ఎటువంటి నష్టం జరకూడదని రైతులు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రకటించారని చెప్పారు.యాసంగి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ,రైతులు దళారులకు తక్కువ ధరకు అమ్ముకుని నష్టపోకూడదని ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.1960/-లకు,కామన్ గ్రేడ్ రూ.1940/లకు కొనుగోలు చేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుగులోతు అరుణ రాంబాబు గారు జడ్పిటిసి తేజవత్ రవీందర్ గారు వైస్ ఎంపీపీ అశోక్ రెడ్డి మాజీ డిసిఎంఎస్ చైర్మన్ మహేందర్ రెడ్డి సర్పంచ్ ఫోరం అధ్యక్షులు తాళ్లపల్లి శ్రీనివాస్ సర్పంచ్ లక్ష్మీ లక్పతి, భానోత్ బిక్కు ఆనంద్ మరియు ఎమ్మార్వో రామ్ ప్రసాద్ ఏవో వీరాసింగ్ టీఆర్ఎస్ నాయకులు, ఐకేపీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
