#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

E69 న్యూస్ బయ్యారం మహబూబాబాద్ జిల్లా.

బయ్యారం ఉక్కు పరిశ్రమ కావాలని మేమంటున్నాం… ఇంతకాలం సన్నాయి నొక్కులు నొక్కి ఇచ్చినట్టే చేసి ఇప్పుడు కాదంటే వదిలేదేలే..అడుగడుగునా నిలదీస్తాం.. బయ్యారం నుంచి డిల్లీదాకా బారతీయ జనతాపార్టీని ప్రజలముందు గల్లా పట్టుకొని నిలబెడతాం.. తగ్గేదేలే.. అంటూ మానుకోట యంపి, టిఆర్ఎస్ జిల్లాఅద్యక్షురాలు మాలోత్ కవిత అన్నారు. బయ్యారంలో టిఆర్ఎస్ దీక్షలో ఆమె మాట్లాడుతూ..
తెలంగాణ న్యాయమైన హక్కు.. బయ్యారం ఉక్కు కాదనడానికి నువ్వెవ్వరు కిషన్ రెడ్డి అని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ ఇవ్వడమే అన్యాయం అని మీ..ప్రధాని మోడి అంటాడు.. బయ్యారం ఉక్కుప్యాక్టరి ఇచ్చేదే లేదని కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి అంటాడు బిజేపి నాయకులు ఈ రెండింటికీ సమాదానం చెప్పాకే.. తప్పయ్యిందని క్షమాపణ చెప్పాకే.. తెలంగాణలో తిరగాలని ఆగ్రహించారు. తెలంగాణ బిడ్డగా ఈ..ప్రాంత అభివృద్ధి పట్ల ప్రత్యేకమైన ప్రేమ ఉండాలి తెలంగాణ రావడం వల్లనే ముఖ్యమంత్రి కేసీఆర్ దయవల్లనే కేంద్రమంత్రిని కాగలిగాననే అభిమానం కిషన్ రెడ్డికి ఉండాలి కాని మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణపైన.. రాష్ట్ర అభివృద్ధిపైన ఏమాత్రం ప్రేమలేకుండా మాట్లాడడం విచారకరమన్నారు. కన్నతల్లి మీద ప్రేమలేని కసాయి కొడుకులా కిషన్ రెడ్డి కనిపిస్తున్నాడని దుయ్యబట్టారు, బరాబర్ చెబుతున్నాం.. బయ్యారంలో ఉక్కుపరిశ్రమ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, గిరిజన జనాభా అధికంగా ఉన్న మహబూబాబాద్ ప్రాంత ప్రజలు బయ్యారం ఉక్కుపరిశ్రమ పైన అనేక ఆశలు పెట్టుకున్నారు.. యువతరం ఉద్యోగ ఉపాధిఅవకాశాలు మెరుగవుతాయని.. బయ్యారం కేంద్రంగా ఈ..ప్రాంతం బంగారంలా మారిపోతుందని..తమ భవిష్యత్ కు బావితరాలకు బంగారుబాటలు పడుతాయని కలలు కంటున్నారని కవిత అన్నారు… వాటినన్నింటిని సమాధి చేయాలని చూస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు, నిలదీస్తారు.. నిన్ను..నీ బీజేపీపార్టీని ఎక్కడికక్కడ ఉతికి ఆరేస్తారు, ఊర్లలోకి రాకుండా తన్ని..తరిమేస్తారంటూ..కవిత మండిపడ్డారు, కిషన్ రెడ్డి గుర్తుంచుకో… బయ్యారంలో ఉక్కుపరిశ్రమ వద్దంటే నీ.. ప్రభుత్వం.. నీ..పార్టీ తెలంగాణలో సర్వనాశనం అవ్వడం ఖాయం.. ఓ..గిరిజన ఆడబిడ్డగా.. ఈ..ప్రాంత ప్రజాప్రతినిధిగా ఇది నా..శాపం..అని కవిత అన్నారు.
ఇది ఆరంభం మాత్రమే… పోరాటం మరింత తీవ్రం అవుతుందని.. బయ్యారం అంటేనే పోరాటం.. తెలంగాణ అంటేనే తిరుగుబాటు.. కుడుమిస్తే పండుగంటం… కానీ.. నోటిదగ్గర కూడు లాక్కోవాలని చూస్తేమాత్రం సహించం… అంటూ మానుకోట యంపి, జిల్లాపార్టీ అద్యక్షురాలు కవిత హెచ్చరించారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.