జనగామ జిల్లా జాఫర్ ఘడ్ మండలంలోని తమ్మడపల్లి జి గ్రామంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా నాయకులు ముహమ్మద్ వలీపాష,మండల ఉపాధ్యక్షుడు పందిబోయిన రాజు మాట్లాడుతూ:-వరంగల్, ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.ఈకార్యక్రమంలో బూత్ కన్వీనర్లు ముప్పిడి సాంబి,మారపల్లి రవి,, జిలకర సాయికుమార్,కేతిరి నాగరాజు, వడ్లకొండ రంజిత్ తదితరులు పాల్గొన్నారు