తమ్మడపల్లి జి గ్రామంలోIKP సెంటర్ ప్రారంభం

జనగామ జిల్లా జాఫర్ ఘడ్ మండలంలోని తమ్మడపల్లి జి గ్రామంలో “ఈ నెల 20వ తేదిన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఐకెపి సెంటర్ ఏర్పాటు చేసి కల్లాల వద్ద వరి ధాన్యం కొనుగోలు చేయాలని నిరసన చేయగా” స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య స్పందించి మండలం లోని అన్ని గ్రామలల్లో తక్షణమే ఐకెపి సెంటర్ ఏర్పాటు చేసి వరి ధాన్యం కొనుగోలు చేసేవిధంగా చూడాలని ధికారులకు,ప్రజాప్రతినిథులకు ఆదేశాలు జారీ చేయగా, అందులో భాగంగానే నేడు తమ్మడపల్లి జి గ్రామంలో ఎంపిపి రడపాక సుదర్శన్ ఆధ్వర్యంలో ఐకేపీ సెంటర్ ను కొబ్బరి కాయ కొట్టి ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక ఎంపిటిసి చిలువేరు శివయ్య, మండల నాయకులు, మరియు గ్రామ రైతు కోఆర్డినేటర్ గద్ద కొమురయ్య, వేల్పుల యాదగిరి, బషీర్,రాజు, మహిళా సంఘాల నాయకురాల్లు రజిత,రేణుకా, నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.