thammadapalli news

పాత కమిటీని రద్దు చేసి కొత్త కమిటీని ఎన్నుకోవాలని విన్నపం

ఈ69న్యూస్ జఫర్ఘడ్ జులై 11

జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలంలోని తమ్మడపల్లి జి గ్రామంలోని మత్స్య పారిశ్రామిక సంఘం వారు గ్రామంలోని చెరువులను వ్యాపారవేత్తలకు లీజుకు ఇవ్వడం జరుగుతున్నదని,దాని వలన గ్రామ మత్స్య పారిశ్రామిక సభ్యులకు నష్టం కలుగుతున్నదని, ఎన్ని సార్లు అడ్డుకున్న లెక్క చేయకుండా ప్రతీసారి వ్యాపారవేత్తలకు లీజుకు ఇవ్వడం జరుగుతుందని కొందరు సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వ్యాపారవేత్తలకు లీజుకు ఇవ్వకుండా చేయాలని, మరియు స్థానిక మత్స్య పారిశ్రామిక కమిటీని రద్దు చేసి నూతన కమిటీని ఎన్నుకునే అవకాశం ఇవ్వాలని సోమవారం జనగామ జిల్లా కేంద్రం లోని జిల్లా మత్స్య శాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ మత్స్య పారిశ్రామిక సంఘం సభ్యులు పందిబోయిన రాములు, పందిబోయిన నాగయ్య కొంతం యాదగిరి అన్నెపు రాజేంద్రం కొంతం నాగరాజు కొంతం కుమార్ కొంతం కృష్ణమూర్తి అన్నెపు ప్రభాకర్ కొంతం రాజు శాగ రాజు పందిబోయిన యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.