తమ్మినేని వీరభద్రం ఇతర నాయకుల అరెస్టును ఖండించండి

రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇతర నాయకుల అరెస్టును ఖండించండి
కలెక్టరేట్ వద్ద జరిగిన సిపిఎం మహాధర్నాలో – బొట్ల చక్రపాణి జిల్లా కన్వీనర్
గత నెల రోజులుగా నిలువ నీడ లేని నిరుపేదలు ప్రభుత్వ భూములను గుడిసెలు వేసుకుంటే బుల్డోజర్ లతో తొలగించి కాల్చడాన్ని ఆపాలని, పేదల వేసుకున్న గుడిసెలకు పట్టాలివ్వాలని, గత కొన్ని సంవత్సరాలుగా నివాసముంటున్న వారికి జీవో నెంబర్ 58 ప్రకారం పట్టాలు ఇవ్వాలని, దేవాదాయ భూమి ప్రభుత్వం కొనుగోలు చేసి కాలనీ వాసులకు పట్టాలు ఇవ్వాలని, భూ పోరాటానికి నాయకత్వంపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని తదితర డిమాండ్ల సాధన కోసం ఈరోజు హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు.
ఈ ధర్నా సందర్భంగా అర్ధరాత్రి నుండి పార్టీ నాయకులు ఇళ్లల్లోకి వెళ్లి బలవంతంగా పార్టీ జిల్లా కన్వీoగ్ కమిటీ సభ్యులు సారంపల్లి వాసుదేవ రెడ్డి నాయకులు టీ ఉప్పలయ్య, పుల్ల అశోకు లతోపాటు 15 మందిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేస్తున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మాజీ పార్లమెంట్ సభ్యులు తమ్మినేని. వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ ను మార్గమధ్యంలో పోలీసులు అరెస్టు చేసి రాయపర్తి పోలీస్ స్టేషన్ కు తరలించారు. టిఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నాలు చేస్తే బందోబస్తు నిర్వహించి ధర్నా జయప్రదం కి సహకరించిన పోలీసులు పేదల ఇంటి స్థలం కోసం సిపిఎం పోరాటం చేస్తుంటే ఈ విధంగా అక్రమ అరెస్టులు చేయడం సిగ్గుచేటని సిపిఎం జిల్లా కన్వీనర్ బొట్ల చక్రపాణి విమర్శించారు. ఈ అక్రమ అరెస్టులను ప్రజాస్వామిక వాదులంతా ఖండించాలి అని ఆయన కోరారు

అక్రమ అరెస్టులతో పోలీస్ నిర్బంధాల తో ఉద్యమాలు పోరాటాలను ప్రభుత్వం ఆప లేరనే విషయం ప్రభుత్వం గుర్తించాలని ఆయన హితవు పలికారు
ఈ ధర్నా ఆర్ట్స్ కాలేజ్ ఆడిటోరియం నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు
ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కన్వీనర్ బొట్ల చక్రపాణి మాట్లాడుతూ….. టిఆర్ఎస్ ప్రభుత్వం వన్ వే ద లకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నా ఎన్నికల హామీని నేటికీ నెరవేరకపోవడంతో కిరాయి ఇండ్లల్లో ఉంటున్న పేదలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ భూములను చెరువులను కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించి వ్యాపారం చేస్తున్నారు అందుకే ఈ భూములను రక్షించడం కోసం స్థలాలు లేని పేదలను సమీకరించి గత నెల రోజులుగా భూ పోరాటాలు నిర్వహిస్తున్నాం ఈ సందర్భంగా పేదలు గుడిసెలు వేస్తుంటే తొలగించడం కాల్చడం ఈ పోరాటాలకు నాయకత్వం వహిస్తున్న నాయకులు పైన అక్రమ కేసులు పెట్టి పేద ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడం అత్యంత దుర్మార్గమని ఆయన అన్నారు గోపాలపురం చెరువులో 20 ఎకరాల భూమి గాను 9 ఎకరాలు మాత్రమే మిగిలి మిగతా భూమి అన్యాక్రాంతం అయ్యింది ఈ చెరువు కింద పారకం లేదు అలాగే కోట చెరువు 53 ఎకరాలకు గాను ఆర్ ఎకరాలు అన్యాక్రాంతం అయ్యింది సుమారు 20 ఎకరాల్లో మట్టిని తవ్వి ఇటుక బట్టీల వ్యాపారం కోసం ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నా రెవెన్యూ అధికారులు చోద్యం చేసినట్టు చూస్తున్నారని ఆయన అన్నారు బంధం చెరువు 21 ఎకరాల గాను 6 ఎకరాలు అన్యాక్రాంతం అయ్యింది ఎల్కతుర్తి మండల కేంద్రంలోని మావు చెరువు కింద పడటం లేదు ఇప్పటికే అనేకమంది పేదలు నివసిస్తున్నారు అయినవోలు మండలం వెంకటాపురం గ్రామం లో పురుషులు వేసుకొని నివసిస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదల పట్ల సానుకూల దృక్పథంతో ఆలోచించి పట్టాలు ఇవ్వాలని ఆయన కోరారు వేలేరు మండలం ఈచుపల్లి గ్రామంలో దళితులు సాగు భూమిని చేసుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వం వీరందరికీ పట్టాలివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కారం చేయకపోతే రాబోయే రోజులలో పేదలు అందర్నీ సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.
అనంతరం జిల్లా ప్రతినిధి బృందం కలెక్టర్ గారికి వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు స్పందించి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ధర్నా కార్యక్రమాన్ని విరమించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీoగ్ కమిటీ సభ్యులు వాంకుడోత్ వీరన్న, రాగుల రమేష్, మంద సంపత్, డి భాను నాయక్, డి తిరుపతి, ఎం.డి మిశ్రీన్ సుల్తానా, నాయకులు గాద రమేష్, తొట్టె మల్లేశం, ఎం చుక్కయ్య, జి. ప్రభాకర్ రెడ్డి, గొడుగు వెంకట్, బండి పర్వతాలు కె రవీందర్, రవి, సంపత్, కుమార్, మల్లయ్య, యాకయ్య, రాజేందర్, రాజు, రమేష్,సారంగపాణి, అరుణ, రాంబాబు, రోజా, కిషోర్ తో పాటు 5 వేల మంది పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.