తల్లాడలో పీరీలను ఊరేగిచ్చిన ముస్లిం సోదరులు

తల్లాడ పట్టణంలోని పాత తహసిల్దార్ కార్యాలయం సమీపంలో గత వారం రోజులుగా మొహరం పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శనివారం పీరెలను ఎత్తుకొని తల్లాడ పట్టణంలో ఊరేగించారు. డప్పు వాయిద్యాలు, మేళ్ళ తాళ్లలతో ముస్లింలు పీరెలను పురవీధుల్లో ఊరేగిచ్చి భక్తిని చాటుకున్నారు. తొలుత పీర్ల భుజావర్ ఎస్ కే ఈసూబ్ హోమగుండం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ర్యాలీని ప్రారంభించారు. అదేవిధంగా హోమగుడ్డం వద్ద సంతానం లేనివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు చాందుపాష, జానీ, బెహరాజ్, రఫీ, బాబు, నాగులు, నాగులు మీరా రఫీ మస్తాన్ యాకూబ్ పాషా అక్బర్ పాషా లాలా తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.