thallada news

ది:13.07.2022వ తేదీన మండల పరిషత్ కార్యాలయం తల్లాడ నందు మండల పరిషత్ అధ్యక్షులు శ్రీ దొడ్డా శ్రీనివాసరావుగారి అధ్యక్షతన సర్వ సమావేశం జరిగింది. ఇట్టి సమావేశం నందు మొదటి తీర్మానముగా తల్లాడ పరిధిలోని సిరిపురం NSP మేజర్ ఏన్కూరు మెయిన్ కెనాల్ తూము ఎత్తుగా ఉండుట వలన మెయిన్ కెనాల్ లో తక్కువ నీరు వచ్చిన రోజు పంట పొలాలకు నీరు అందక పంట నష్టం జరుగుతున్నందున మెయిన కెనాల్ తూము ఎత్తును తగ్గించుటకు తీర్మానించడమైనది. తదుపరి రెండవ తీర్మానముగా తల్లాడ మండల పరిధిలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా కుర్ణవల్లి,నూతనకల్,మిట్టపల్లి ఆరోగ్య ఉప కేంద్రముల యందు వైధ్యుల నియామకం కొరకు తీర్మానించడమైనది… తదుపరి తీవ్రమైన వర్షముల వలన వచ్చే సీజనల్ వ్యాధులు ప్రభలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి చర్చించడమైనది, మిషన్ భగీరద పధకం ద్వారా నీటి సరఫరా తలెత్తుతున్న సమస్యల గురించి, హరితాహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి 6 మొక్కల పంపకం గురించి, గ్రీన్ బెల్ట్ ఏరియాలో మొక్కలు నాటుట, ఎవెన్యూ ప్లాంటేషన్ గురించి చర్చించడం జరిగింది,ప్రభుత్వ పాఠశాలల యందు ఉన్న సధుపాయములు వాటి వలన విద్యార్ధులకు కలిగే ఉపయోగములు గురించి, మన ఊరు మన బడి కార్యక్రమపు అములు గురించి చర్చిండమైనది. ఇట్టి కార్యక్రమంలో తల్లాడ మండల సర్పంచు గార్లు, MPTC గార్లు, మండల పరిషత్ అభివృద్ది అధికారి శ్రీ భీమిరెడ్డి రవీంద్రా రెడ్డిగారు, మండల పంచాయితీ అధికారి శ్రీమతి కొండపల్లి శ్రీదేవి గారు, పంచాయితీ రాజ్ ఏఈ శ్రీ మాటేటి అశోక్ గారు, మండల విధ్యాశాఖా అధికారి శ్రీ దామోదర్ ప్రసాద్ గారు, మండల వ్యవసాయాధికారి శ్రీ తాజుద్దీన్ గారు, ప్రభుత్వ వైధ్యులు శ్రీ Dr వి నవ్యకాంత్ గారు, విధ్యుత్ శాఖా ఏఈ తల్లాడ శ్రీ రాజేష్ గారు, కుర్ణవల్లి క్లస్టర్ ఏఈ శ్రీ సుందర్ గారు, ఇతర మండల స్థాయి అధికారులు, పంచాయితీ కార్యదర్శులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.