తల్లాడ రెవెన్యూ ఆఫీస్ దగ్గర శాంతియుత ఆందోళన కార్యక్రమం

ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో తెలంగాణ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం తల్లాడ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు తల్లాడ రెవెన్యూ ఆఫీస్ దగ్గర శాంతియుత ఆందోళనలో కార్యక్రమం నిరసించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆ సంఘం యొక్క అధ్యక్షులు D, శిరీష గారు మాట్లాడుతూ వీఆర్వోలకు స్పష్టమైన విధులు బాధ్యతలు జాబ్ చార్ట్ ప్రకటించాలి, వీఆర్వోలను రెవెన్యూ శాఖలోనే రీ లోకేట్ చేయాలి, పదోన్నతులు నిలుపుదల చేశారు వెంటనే పదోన్నతులు ఇవ్వాలి, 6 12 18 సంవత్సరాల ఇంక్రిమెంట్లు నిలుపుదల చేశారు వాటిని వెంటనే ఇవ్వాలి, అకాల మరణం చెందిన వీఆర్వోల కుటుంబాలలో 2015 సంవత్సరం నుండి కారుణ్య నియమకాలు చేపట్టలేదు వెంటనే ఆ కుటుంబాలలో కారుణ్య నియామకాలు చేపట్టాలి, వివిధ కారణాల వలన సస్పెండ్ అయిన వారికి పోస్టింగ్ ఇవ్వడం లేదు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలి, సర్వీస్ రెగ్యులర్ కాని వారికి సర్వీస్ రెగ్యులర్ చేయాలి, సర్వో టు ఆర్డర్లో ఇతర జిల్లాల్లో ఉండిపోయిన వీఆర్వోలను వారి కుటుంబాలకు కొన్ని సంవత్సరాల నుండి దూరంగా ఉంటున్నారు వారి అదృష్టం మేరకు వారి సొంత జిల్లాలకు బదిలీలు చేయాలి, సాధారణ బదిలీలు మెడికల్ ఒంటరి మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ పరస్పర బదిలీలు కౌన్సిలింగ్ పద్ధతిలో బదిలీలు చేయాలి, ఇవి అన్ని మా న్యాయమైన దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం చేయకపోవడం వలన మేము ఆర్థికపరంగా సామాజికపరంగా తీవ్రమైన నష్టాన్ని అనుభవిస్తున్నాము గ్రామస్థాయిలో ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్న చిరు ఉద్యోగులమైన మేము మానసికంగా శోభకు గురవుతున్నాము మాకు జరిగిన అవమాన భారంతో మానసికంగా కృంగిపోతున్నాము మాకు జాబ్ చాట్ ఇచ్చి రెవిన్యూ శాఖలో మమ్ములను రీ లోకేట్ చేయాలని దయ మాయులైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు మా యందు దయవుంచి మా సమస్యలను త్వరగా పరిష్కరించగలరని కోరుచున్నాము అని ఈ సందర్భంగా వారు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో విఆర్వోల సంఘం తరఫున తల్లాడ ఎమ్మార్వో గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది: అధ్యక్షులు 😀 శిరీష సెక్రెటరీ: భిక్షం సాహెబ్: కోశాధికారి: వీ సందీప్ :డివిజన్ కార్యదర్శి: టి రాము విఆర్వోలు: పి నరసింహారావు, ధర్మ, అనసూర్య ,ఆనందరావు ,నాగేశ్వరరావు పాల్గొనడం జరిగింది

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.