తాడిపత్రి పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఇప్పటి నుండి 144 సెక్షన్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు పేర్కొన్నారు. ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుమిగూడరాదన్నారు. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. 30 పోలీసు యాక్టు కూడా అమల్లో ఉంటుందన్నారు. శాంతి భద్రతల దృష్ట్యా ప్రత్యేక భద్రతా బలగాలను తాడిపత్రిలో మొహరింపజేశామన్నారు. గ్రామీణ ప్రాంతాల నుండీ అనవసరంగా పట్టణానికి వచ్చి గ్రూపుల్లో చేరిపోవడం చేయరాదన్నారు. తాడిపత్రి పట్టణం, పరిసర ప్రాంతాలలో సి.సి కేమేరాలు, డ్రోన్ ల ద్వారా నిఘా ఉంచామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కల్గించే విధంగా వ్యవహరిస్తే ఎవర్నీ ఉపేంక్షించబోమని స్పష్టం చేశారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.