తారక రామారావు గారి 25వ వర్ధంతి

గుత్తి సమాచారం -: ఈరోజు గుత్తి మున్సిపాలిటీ లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెంకట శివుడు యాదవ్ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 25వ వర్ధంతిని పురస్కరించుకొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది. ఆ తరువాత అన్నగారి ఆశయ సాధనలో భాగంగా పేదలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అనంతరం పామిడి పట్టణంలో జరుగు రక్తదాన శిబిరంలో రక్తదాతలను కలిసి అభినందనలు తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మండల నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగినది.

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.