తారక రామారావు 25 వ వర్ధంతి

తెలుగు జాతి రత్నం శ్రీ నందమూరి తారక రామారావు 25 వ వర్ధంతి సందర్భంగా బిసి సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కందుకూరి నరేష్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.
దేశ చరిత్రలోనే మొదటిసారి తెలుగు జాతి మహనీయుడు ఎన్టీఆర్ ఒక్కడే.. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు బ్రాంచ్ ఆఫీస్ లు కాదని వాటి స్వతంత్రను,
రాజ్యాంగ బద్ధతను చాటి చెప్పి వాటి ఆత్మగౌరవానికై పోరాడి నిలబడినా ఏకైక నాయకుడు ఎన్టీఆర్ .
తన సంక్షేమ పథకాలతో పేద బడుగు బలహీన వర్గాలకు ఆర్థిక న్యాయం చేసినా మొట్టమొదటి తెలుగు సామ్యవాద నాయకుడు ఎన్టీఆర్ . తెలుగుదేశం పార్టీ స్థాపన ద్వారా బడుగు బలహీన వర్గాల గుడిసెలలో గడప గడపకు రాజకీయ అవకాశాలను రాజ్యాధికారాన్ని తెచ్చిపెట్టిన నాయకుడు నందమూరి తారక రామారావు . ప్రాంతం అనే తేడా లేకుండా, వివక్ష చూపకుండా తెలంగాణకు సామాజిక, రాజకీయ స్వాతంత్రాన్ని ఇచ్చి చూపెట్టిన మహనీయుడు నందమూరి తారక రామారావు . నేడు తెలంగాణ లో నాయకులుగా పేరు ప్రఖ్యాతులు గడిస్తున్నా నాయకుల్లో 99% మంది ఆయన పెట్టిన తెలుగుదేశం పార్టీ నీడలో ఎదిగిన వారే కావడం గమనార్హం.
ప్రాంతాల కతీతంగా తెలుగుజాతి ప్రజలందరూ గుర్తుంచుకోదగ్గ నాయకులు ఎన్టీఆర్ . ఆయనగారి ఆత్మబలంతో, ఆశీస్సులతో ఆయన ఆశయాలను కొనసాగిస్తామని, లక్ష్యాలను సాధించడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలుపుతన్నాం.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి ఎరుకల లింగారెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి నల్ల రవి, తెలుగుదేశం పార్టీ మండల నాయకులు గోనె మధుకర్, శానబోయిన అనిల్, పంగ రాంబాబు, పెరుమండ్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.