ఈ6న్యూస్ జఫర్గడ్/మార్చి05
మండలంలోని తిడుగు గ్రామంలో 4 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై బి.మాధవ్ గౌడ్ తెలిపారు.తదుపరి వారు మాట్లాడుతూ మండల పరిధిలో ఎక్కడైనా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అలాగే 30 రోజుల వ్యవధిలో 30 ట్రాక్టర్లు,5జేసీబీలు,2హిటాచ్ లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.అంతేకాకుండా ఇసుకను రవాణా చేస్తూ రెండో సారి ఎవరూ పట్టుపడిన తహశీల్దార్ వద్ద బైండోవర్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.
