తిరుమలగిరి గ్రామ సర్పంచ్ బక్క పుల్లయ్య సర్పంచ్ పదవి నుండి తొలగింపు సమంజసం కాదని. తిరిగి సర్పంచ్ బాధ్యతల్లో కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలనిసిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనుకరెడ్డి అన్నారు. శనివారం పాలకుర్తి మండలంలోని తిరుమలగిరి గ్రామాన్ని సిపిఎం బృందం సందర్శించి ఇటీవల కాలంలో జైలుకు వెళ్లి సస్పెన్షన్ వేటు పడిన సర్పంచ్ గారి తో గ్రామ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం పాటు పడుతున్న వారిపై అధికార పార్టీ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని మారుమూల గ్రామమైన తిరుమలగిరి గ్రామ అభివృద్ధి కోసం నిధులు కేటాయించి అభివృద్ది చేయాలని అధికార పార్టీ కానందున కక్షపూరితం సాధించడం సరైందికాదని ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులను గ్రామాల అభివృద్ధికి సహకరించాలని అధికార పార్టీ కానందున కక్షపూరితంగా వ్యవహరించి తొలగించాలని అనుకోవడం సరైంది కాదని తిరుమలగిరి అభివృద్ధి కోసం నిధులు కేటాయించి గ్రామం అభివృద్ధి కోసం ప్రభుత్వం ఉపయోగపడాలి అన్నారు. ఇతర పార్టీ లో గెలిచిన సర్పంచ్ ల పట్ల కక్షపూరిత పద్ధతులు మానుకోవాలని గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు అందించి ప్రజల కోసం పనిచేసే ఏ పార్టీ వాళ్ళు గెలిచిన అభినందించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు. సిపిఎం ఏరియా కార్యదర్శి సింగారపు రమేష్. ఏరియా కమిటీనాయకులు చిట్యాల సోమన్న. సిపిఎం నాయకులు మాసంపల్లి నాగయ్య. రజక వృత్తిదారుల సంఘం మండల ప్రధాన కార్యదర్శి ఏదునూరి మదర్. ఉప్పారావు. రాజు తదితరులు పాల్గొన్నారు