తీవ్ర ఉద్రిక్తత నడుమ మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర అరెస్ట్

కొల్లు రవీంద్ర అరెస్ట్ ను ఖండిస్తూ ఆందోళనకి దిగిన టీడీపీ కార్యకర్తలు*
మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర మాట్లాడుతూ వైసీపీ చేస్తున్న అక్రమాలను ప్రశ్నిస్తున్నoదుకు నాపై అక్రమ కేసులు పెడుతున్నారు. మంత్రి పేర్ని నన్ను ఇబ్బంది పెట్టాలని నాపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారు. నిన్న ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెళ్లిన నాపై వైసీపీ వారే దురుసుగా ప్రవర్తించారు. నేను ఎక్కడికి వెళ్ళడానికి లేదని హౌస్ అరెస్ట్ అని చెపితే నేను ఇంట్లోనే ఉన్నాను. ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు నన్ను పోలీసులు మీడియాతో మాట్లాడనివ్వకుండా ఇబ్బందులు పెట్టారు. సంబంధం లేని వాటిల్లో నన్ను ఇరికించి కావాలని కేసులు పెడుతున్నారు.గతంలో ఎప్పుడు ఇటువంటి పరిస్థితి లేదు. ప్రజాస్వామ్యం ఏమౌతుందో అర్ధం కావడం లేదు.పోలీసులు అడిగితే నేనే వచ్చి సమాధానం చెప్పే వాడిని. తెల్లవారుజాము నుంచి పోలీసులు ఇంటిని చుట్టూ ముట్టి ఎవ్వరిని రానివ్వకుండా చేశారు.
శివరాత్రి రోజున నది స్నానానికి వెళ్లి పితృదేవతలకు పూజ చేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. అరెస్టులు శాశ్వితం కాదు.మాపై చేస్తున్న అరాచకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తాము.
పోలీసులతో పాలన చేయాలి అనుకుంటే ముఖ్యమంత్రి జగన్ ఎక్కువ రోజులు ఉండరు. కేసులు పెట్టి తాత్కాలికంగా ఇబ్బందులు పెడుతున్నారు… రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో గుర్తు పెట్టుకోవాలి.మాకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.