వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి

(Nprd రాష్ట్ర ప్రధాన కార్యదర్శి M.ఆడవయ్య డిమాండ్.)

తీవ్ర వైకల్యం కలిగిన వికలాంగుల సహాయకులకు 20000 ప్రత్యేక అలవెన్సులు చెల్లించాలని, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి M. అడివయ్య డిమాండ్ చేశారు.

దివి: 03-04-2021 శనివారం రోజున పట్టణంలోని స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో సంఘం జిల్లా అధ్యక్షులు పాముకుంట్ల చందు అధ్యక్షతన వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ( NPRD) జనగామ జిల్లా కమిటీ సమావేశం ఏర్పాటు చేయగా ఈ సమావేశానికి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి M.ఆడవయ్య ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు ఎదురుకుంటున్న 32 రకాల సమస్యలపై సర్వే చేస్తున్నామని తెలిపారు. సర్వేలో వచ్చిన సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామని అన్నారు. 2021-22 సంవత్సరం రాష్ట్ర బడ్జెట్లో వికలాంగులను విస్మరించి మోసం చేసారని అన్నారు.5 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్. చేశారు .మానసిక వికలాంగుల తలిదండ్రుకు నెలకు రూ.3000 అలవెన్సు చెల్లించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ పెన్షన్ దరఖాస్తులకు వెంటనే నిధులు విడుదల చేయాలని, వికలాంగుల స్వయం ఉపాధికి ఎలాంటి షరతులు లేకుండా 10 లక్షల ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. వికలాంగుల అందరికీ ఉచితంగానే కరోనా వ్యాక్సిన్ వేయాలని అన్నారు. గత సంవత్సర కాలం నుండి పెండింగ్లో ఉన్న ఆసరా పెన్షన్ లను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
రద్దు చేసిన 1,16,534 ఆసరా పెన్షన్ లను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. 21రకాల వైకల్యాల ధ్రువీకరణ పత్రాలను మంజూరు చేయాలని తెలిపారు. వికలాంగుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఫ్లోరైడ్ బాధితులు అందరికీ రూ. 3016 పింఛన్ చెల్లించాలని, ఉపాధి హామీ పథకంలో వికలాంగుల అందరికీ 200 రోజుల పనిదినాలు కల్పించాలని ప్రత్యేక గ్రూపులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తలసేమియా, రక్తహీనత వ్యాధి బాధితులందరికీ ప్రభుత్వమే ఉచితంగా డయాలసిస్ రక్తం సరఫరా చేయాలని అన్నారు. నామినేటెడ్ పోస్టుల్లో 5 శాతం వికలాంగుల కోసం కేటాయించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మెట్రో, డీలక్స్, హైటెక్ బస్సు లలో వికలాంగులను అనుమతించాలని అన్నారు. పెండింగ్లో ఉన్న వివాహ ప్రోత్సాహకాన్ని వెంటనే మంజూరు చేయాలని, ఇద్దరు వికలాంగులు వివాహం చేసుకుంటే 5 లక్షల ప్రోత్సాహకం, ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వికలాంగుల చట్టాలను రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని విమర్శించారు. చట్టాల మార్పులు చేయాలని ఆలోచన విరమించుకోకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వికలాంగ మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, అత్యాచారాలు అరికట్టాలని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో వికలాంగులకు 5% కేటాయిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చినప్పటికీ అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ర్యాoపులు నిర్మించాలని, వికలాంగుల అందరికీ బ్యాటరీ వీల్ చైర్స్ అందించాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బిట్ల గణేష్, జిల్లా కమిటీ సభ్యులు తోట సురేందర్, మాలోతు రాజ్ కుమార్, పిట్టల కుమార్, ఉప్పరి వేణు, పులిగిల్ల రాజయ్య, ప్రతాపగిరి రవికుమార్, బండవరం శ్రీదేవి, ఆకారపు కుమార్, భూమా రజిత, ఇట్టబోయిన మధు, నాచు అరుణ, పులి మంజుల, రడపాక యాదగిరి, పిట్టల రజిత, తదితరులు పాల్గొన్నారు.

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.