ts

ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ డిమాండ్

ప్రముఖ సంఘసేకురాలు, మానవ హక్కుల కార్యకర్త తీస్తా సెతెల్వాద్ ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ తీవ్రంగా ఖండించారు. ఆమెపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
తీస్తా సెతెల్వాద్ అక్రమ అరెస్టును నిరసిస్తూ హైదరాబాదులోని ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్బాస్ మాట్లాడుతూ….
2002 గుజరాత్ మారణకాండ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని, దేశ చరిత్రలో అది ఒక చీకటి అధ్యాయమని అన్నారు. ఆ మారణకాండ చీకటి కోణాలను వెలికితీసి, రాజకీయ ప్రయోజనాల కోసం మత మారణకాండ సృష్టించిన వారిలో కొంతమందికి శిక్షలు పడేలా పోరాడిన వ్యక్తి తీస్తా సెతెల్వాద్ అని అన్నారు.
గుజరాత్ మారణకాండకు మోదీనే కారణం అని, “వాళ్ళ కోపాన్ని తీర్చుకొనివ్వండి” అని పోలీసులను ఆ వైపు వెళ్ళొద్దని అన్నాడని ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ వాగ్మూలం ఇచ్చారు, కాని మాజి ఎంపి ఇషాన్ జాఫ్రీ కుటుంబాన్ని సజీవదహనం చేసిన కేసులో మోదీకి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ క్లీన్ చిట్ ఇచ్చిందని విమర్శించారు. దానికి వ్యతిరేకంగా ఇషాన్ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ సిట్ కి కీలకమైన ఆధారాలు ఇచ్చినా వాటిని పరిగణలోకి తీసుకోకుండా క్లీన్ చిట్ ఇచ్చిందని ఆమె వాదిస్తుంటే, ఆ మొత్తం ఘటనకు జకియా జాఫ్రీనే సజీవ సాక్ష్యం,ఆమె చెప్పిన, చూపిన సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకోకుండా సిట్ ఇచ్చిన నివేదికకు విలువేముంటుదని అన్నారు. సిట్ క్లీన్ చిట్ నివేదిక పై జకీయా జాఫ్రీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే “పూర్తిస్థాయి స్వాతంత్ర్యతతో సుప్రీంకోర్టు పనిచేస్తుందని, మీరు నమ్మొచ్చు” అని సాక్షాత్ చీఫ్ జస్టిస్ జకియా జాఫ్రీ తో చెప్పిన మర్నాడే జకియా జాఫ్రీ కేసు తీర్పు వెలువడింది.
“సిట్ క్లీన్ చిట్ ఇవ్వడం తప్పు కాదని, సిట్ చాలామంచి పరిశోధనే చేసిందని, తీస్తా సెతల్వాద్ జకీయా జాఫ్రీ ఎమోషన్స్ ని వాడుకుందని చెప్తూ సుప్రీం కోర్టు కేసును కొట్టివేసిందని అన్నారు. బాధితులకు ఇది ఆశనిపాతం అయిందని అన్నారు.

సిట్ దర్యాప్తు పై జకియా జాఫ్రీ వాదనలను పట్టించుకోకుండా సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలతో
తీస్తా సెతల్వాద్ గుజరాత్ 2002 కు సంబంధించి పోలీసులకు తప్పుడు సాక్ష్యాలు ఇచ్చిందని అమిత్ షా ఆరోపణలు చేసారు. ఆ మరునాడే తీస్తా, సంజీవ్ భట్, ఆర్బీ శ్రీకుమార్ అనే ఐపీఎస్ ఆఫీసర్ల పై తప్పుడు సాక్ష్యాలు ఇచ్చారు అని గుజరాత్ ఏటీఎస్ కేసు పెట్టింది, తీస్తాను అరెస్ట్ చేశారు. బాధితులకు న్యాయం జరగలేేదు, పైగా
వారికి అండగా నిలబడిన వారిని కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారు. బాధితుల పక్షాన నిలబడిన వారిని భయపెడుతున్నారని విమర్శించారు.
సంజీవ్ భట్ ఇప్పటికే జైల్లో ఉన్నాడని అన్నారు.

హక్కుల పరిరక్షణ కోసం నిలబడే వారిపై తప్పుడు కేసులు బనాయించి జైల్లో పెట్టడం ద్వారా అసమ్మతిని అణచివేయాలని ప్రభుత్వం భావిస్తోందని, ఇది సరైంది కాదన్నారు. ప్రజలకోసం, ప్రజా హక్కుల కోసం పోరాడుతున్న వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడి భయబ్రాంతులకు గురిచేయడం ద్వారా ప్రజాస్వామిక హక్కుల కోసం ఎవరు ముందుకు రాకుండా చేయాలనేది పాలకుల కుట్రని విమర్శించారు. ఈ అప్రజాస్వామిక, నిరంకుశ ధోరణులను ప్రజలంతా ఖండించాలని, ప్రజాస్వామిక విలువల రక్షణ కోసం పోరాడుతున్న మానవ హక్కుల కార్యకర్తలకు అండగా నిలబడాలని, ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అజీజ్ అహ్మద్ ఖాన్ (పాషా), ఆవాజ్ రాష్ట్ర కోశాధికారి షేక్ అబ్దుల్ సత్తార్, రాష్ట్ర సహాయ కార్యదర్శి మహమ్మద్ అలీ, ఇబ్రహీం, ఖాజా గరీబ్ నవాజ్, షరీఫ్, నజీర్, నాజియా, ఇబ్రహీం, అలీ తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.