తెలంగాణలోని సాగు నీటి ప్రాజెక్టుల్లో అవినీతిపై విచార‌ణ జ‌రపాలి-వైయ‌స్ ష‌ర్మిల

తెలంగాణలోని సాగు నీటి ప్రాజెక్టుల్లో అవినీతిపై విచార‌ణ జ‌రిపి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయ‌స్ ష‌ర్మిల గారు ఇంజనీర్ ఇన్ చీఫ్(ఇరిగేషన్) మురళీధర్ రావుకు విన‌తి ప‌త్రం అంద‌జేశారు. అనంత‌రం జ‌లసౌధ వ‌ద్ద నిర్వ‌హించిన ధ‌ర్నాలో వైయ‌స్ ష‌ర్మిల గారు మాట్లాడారు…

 • కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కాంట్రాక్ట‌ర్‌ నాణ్యత లేని పనులు చేశారు. అధికారులు మాత్రం కాంట్రాక్టర్ తప్పు లేదు అని మాట్లాడుతున్నారు.
 • ప్ర‌భుత్వం, అధికారులు కాంట్రాక్టర్లను వెనకేసుకొస్తున్నారు.
 • ఇటీవ‌ల వ‌ర్షాల‌తో ప్రాజెక్టులో జ‌రిగిన న‌ష్టానికి క్లౌడ్ బర‌స్ట్ కారణం అని చెప్పడం హాస్యాస్పదం.
 • కనీసం ర‌క్ష‌ణ గోడ నిర్మాణంలో కూడా నాణ్య‌త‌ లేదు.
 • లక్షల కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ కనీసం ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదు.
 • కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కేసీఆర్ ఎన్నో మాటలు చెప్పారు. ప్ర‌పంచంలోనే అద్బుత‌మైన ప్రాజెక్టు అన్నారు. మ‌రి ప్రాజెక్టు మూడేళ్లలోనే ఎందుకు మునిగిపోయింది?
 • కాళేశ్వరం ఒక అద్బుత‌మైన‌ అబద్ధం, అద్భుతైన మోసం.
 • 80 వేల పుస్తకాలు చదివాన‌ని చెప్పుకొనే కేసీఆర్.. ప్రాజెక్టు రీ డిజైనింగ్ మీద ఎన్ని పుస్తకాలు చదివారు? ఎన్ని ఇంజనీరింగ్ పుస్తకాలు చదివి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు?
 • కాళేశ్వరం నా చెమట, రక్తం, మెద‌డు అన్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు తల ఎక్కడ పెట్టుకుంటారు?
 • వైయ‌స్ఆర్ గారు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును రూ.33 వేల కోట్లతో రూపొందించారు.
 • కేసీఆర్ ఆ ప్రాజెక్టుకు తలకాయ అయిన ప్రాణహిత, కాళ్లు అయిన చేవెళ్లను తీశేశారు.
 • ప్రాజెక్టుకు అయ్యే ఖ‌ర్చును రూ.33 వేల కోట్ల నుంచి లక్షా 70 వేల కోట్లకు పెంచారు.
 • కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఇప్పుడు ఫోటోలకు టూరిస్ట్ స్పాట్ చేశారు.
 • 45 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పారు. ఒక్క ఎక‌రాకు కూడా నీళ్లివ్వ‌లేదు.
 • 55 వేల ఎకరాలకు ఇస్తున్నాం అని చెప్తున్నారు. అసలు చెప్పిన దానికి ఇప్పుడు జ‌రుగుతున్న దానికి పొంతన‌ లేదు.
 • ఇది ప్రజల ప్రాజెక్టు కాదు… పూర్తిగా కేసీఆర్ కమీషన్ల ప్రాజెక్టు
 • కేసీఆర్ తెలంగాణ సంప‌ద‌ను దోచుకోవడానికి కట్టిన ప్రాజెక్టు.
 • మెగా కృష్ణారెడ్డి, కేసీఆర్ కలిసి పట్టప‌గ‌లు దోచుకున్నారు.
 • దోచుకోవడానికి కాకపోతే కేసీఆర్ గారు ఎందుకు కట్టారు?
 • మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని ప్రాజెక్టుల పేరుతో అప్పులకుప్పగా చేశారు.
 • అప్పులు తేవడం.. ప్రాజెక్టుల మీద ఖ‌ర్చు పెట్టడం.
 • అసలు తెలంగాణలో ఇంకో మొనగాడే లేనట్లు కేవలం మెగా కృష్ణారెడ్డికే ఎందుకు కాంట్రాక్టు ఇస్తున్నారు?
 • కాళేశ్వరం ఆయనే, పాలమూరు ఆయనే, మిషన్ భగీరథ కూడా ఆయకే.
 • ఒక్క మనిషికే అన్ని ప్రాజెక్టులు ఎందుకు కట్టబెడుతున్నారు?
 • ఇలాంటి పరిస్థితి దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేదు.
 • మెగా కృష్ణారెడ్డి కేసీఆర్ మనిషి.. అందుకే ఆయనకు ప్రాజెక్టులు కట్టబెడుతున్నారు.
 • మెగా కృష్ణారెడ్డికి కేసీఆర్ భాగ‌స్వామి. అత‌ను దోచుకునే దాంట్లో కేసీఆర్ కుటుంబానికి వాటా ఉంది. కేసీఆర్ కుటుంబానికి డబ్బులు అందుతున్నాయి.
 • ప్రతి ప్రాజెక్టు మెగాకి ఇవ్వడం వెనుక కార‌ణ‌మేంటో ప్రతి ఒక్కరికీ అర్థం అవుతుంది.
 • తెలంగాణ తెచ్చుకున్నది మెగా కృష్ణారెడ్డి కోస‌మా? కేసీఆర్ కోసమా?
 • స్వ‌రాష్ట్రంతో వీళ్ళు ఇద్దరే బాగుపడ్డారు.
 • ఎంతోమంది యువ‌త‌ బలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణలో ఇప్పుడు వీళ్లకు మాత్ర‌మే మంచి జ‌రుగుతోంది.
 • మూడేళ్లలో కూలిపోయే ప్రాజెక్టును ఎక్కడైనా చూశామా?
 • కన్నేపల్లి ప్రాజెక్టు బ్రిక్స్ తో కడితే కూలిపోయింది అంటున్నారు.
 • అన్నారం పంప్ హౌజ్ లో అయితే మట్టితో కట్టారు అని చెప్తున్నారు.
 • మీకు మీకు లావాదేవీలు లేకపోతే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?
 • కాళేశ్వరం ప్రాజెక్టు కంటే ఎక్కువ వరదలు వచ్చినా దేవాదుల ప్రాజెక్టు చెక్కు చెదరలేదు.
 • దేవాదుల వైయ‌స్ సమర్థత కి నిదర్శనం… కాళేశ్వరం కేసీఆర్ అవినీతికి నిదర్శనం.
 • రెండు టీఎంసీలు కూడా నీళ్ళు ఎత్తింది లేదు. మళ్ళీ మూడో టీఎంసీ ఎత్తడానికి సిద్ధం అయ్యారు
 • అది కూడా మళ్ళీ మెగా కృష్ణారెడ్డికే ఇవ్వడానికి సిద్ధ‌మ‌య్యారు.
 • మిగతా కాంట్రాక్టర్లను ఎవరినీ బ్రతకనివ్వరా?
 • కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.70 వేల కోట్ల అవినీతి జరిగింది.
 • రూ.12 వేల కోట్లు GST ఎగ్గొట్టారు అని రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. అయినా చర్యలు తీసుకోవ‌డం లేదు.
  .

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.