289 వర్ణాల్లో బతుకమ్మ చీరలు పంపిణీ- ఎంపీపీ చింతా కవితా రాదారెడ్డి.
తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబం బతుకమ్మ పండుగ – ఎంపీపీ చింతా కవితా రాదారెడ్డి
మండల పరిషత్ కార్యాలయంలో అక్టోబర్ 6 వ తారీఖు నుండి జరగనున్న బతుకమ్మ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం పేద మహిళలకు ఉచితంగా పంపిణీ చేస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎంపీపీ చింతా కవితా రాదారెడ్డి గారు మాట్లాడుతూ
తెలంగాణ ప్రభుత్వం,అధినేత కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏడాది పంపిణీ చేస్తున్న బతుకమ్మ చీరలకు ఈ ఏడాది రూ.318 కోట్లను వెచ్చించి సరికొత్తగా 17 రంగులు, 17 డిజైన్లతో కలిపి మొత్తం 289 వర్గాలలో రూపొందించారని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత బొల్లం మల్లయ్య యాదవ్ గారి ప్రత్యేక చొరవతో పకడ్బందీగా అర్హులందరికీ బతుకమ్మ చీరలు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఈ చీరల పంపిణీకి గ్రామాల్లో రేషన్ డీలర్, పంచాయతీ కార్యదర్శి, మహిళా సంఘం ప్రతినిధులతో కూడిన కమిటీ ఆధ్వర్యంలో అందరికీ పంపిణీ చేయాలని ఆహార భద్రత కార్డులతో వచ్చి లబ్దిదారులు చీరలు పొందవచ్చని అన్నారు. ఈ సందర్భంగా కొవిడ్ నిబంధనలను విధిగా పాటించాలని సామాజిక దూరం, మాస్కులు ధరించడం తప్పనిసరనీ అన్నారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీనివాసశర్మ,mpdo విజయశ్రీ, ఎంపీఓ పాండు రంగన్న యాదవ్,VRO లు,పంచాయతీ కార్యదర్శులు అధికారులు తదితరులు పాల్గొన్నారు
