తెలంగాణ మలిదశ ఉద్యమంలో టిఆర్ఎస్ జెండా చేతబట్టి ఉద్యమంలో పాల్గొన్న ప్రతి తెలంగాణ కార్యకర్తలకు అండగా ఉంటానని కోదాడ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కన్మంత రెడ్డి శశిధర్ రెడ్డి అన్నారు, ఇటీవల అనారోగ్యంతో తెలంగాణ మొట్టమొదటి కార్యకర్త మునగాల మండల కేంద్రానికి చెందిన వల్లోజు వెంకటేశ్వర్లు అలియాస్ లాయర్ మృతి చెందిన సంఘటన లో సోమవారం నాడు వారి కుటుంబాన్ని పరామర్శించి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమంలో వల్లోజు వెంకటేశ్వర్లు మునగాల గ్రామంలో మొట్టమొదటిసారిగా జెండా చేతపట్టి తెలంగాణ వాదాన్ని గడపగడపకు తీసుకోవడంలో ముఖ్యపాత్ర వహించిన వెంకటేశ్వర్లు మృతి చెందడం చాలా బాధాకరమైన విషయం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ భవిష్యత్తులో తెలంగాణ ఉద్యమకారులకు అందుబాటులో ఉంటూ అండగా ఉంటానని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కాసాని మల్లయ్య గౌడ్ గుండు సతీష్ కుమార్ ,రాయి రవి, చిన్న రాజు, దయా,వంశీ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *