బిజెపి స్టేషన్ ఘనపూర్ మండల అధ్యక్షులు గట్టు కృష్ణ గౌడ్

స్టేషన్ ఘనపూర్/జఫర్ ఘడ్

నిన్న ఒక కార్యక్రమంలో కడియం శ్రీహరి భారతీయ జనతా పార్టీ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బిజెపి రాష్ట్ర నాయకులు మాదాసు వెంకటేష్ సూచనలమేరకు,మండల పార్టీ అధ్యక్షులు గట్టు కృష్ణ గౌడ్ మాట్లాడుతూ
తెలంగాణ ద్రోహి,ఏనాడూ ఉద్యమంలో లేకుండా,తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా పనిచేసి,ఉపముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి చేయకుండా ఉన్న వ్యక్తి కడియం శ్రీహరి అని వారికి బీజేపీని విమర్శించే నైతిక అర్హత లేదని అన్నారు.బిజెపి ప్రభుత్వం దళిత,మైనార్టీ వర్గాలకు వ్యతిరేకం అని అనడం వారి అవివేకమే అని అన్నారు.అబ్దుల్ కలాంను,రాంనాథ్ కొవింద్ గార్లను రాష్ట్రపతులను చేసిన పార్టీ బిజెపి అని గుర్తుచేశారు.
తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశతో ఉద్యమంలో పాల్గొని,1200 మంది బలిదానాలు చేసుకుంటే,తెలంగాణ ఏర్పాటుకు మద్దతు తెలిపిన పార్టీ బీజేపీనేనని,తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఉద్యోగ నోటిఫికేషన్స్ లేక ఉన్నత చుదువులు చదివిన విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే,యువత టీఆర్ఎస్ వైపు ఉందని కడియం చెప్పడం సిగ్గుచేటని అన్నారు.
రాష్ట్ర మంత్రిగా,లెదర్ పార్క్ కొరకు శంకుస్థాపన చేసి,దానిని గాలికి వదిలేశారని,కడియం శ్రీహరి మరియు రాజయ్య చేతకాని తనం వలన,ఉపాధి లేక యువకులు హైదరాబాద్ వెళ్లి అడ్డ కూలీలుగా మారారని తెలిపారు.
గ్రూప్ రాజకీయాలు తప్ప కడియం చేసిన అభివృద్ధి ఎం లేదని ఆరోపించారు.
గ్రామపంచాయతీలకు కేంద్ర ప్రభుత్వ ఇచ్చే నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని,ప్రత్యేకంగా తెరస ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమి లేదని తెలిపారు.అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు విసిగిపోయి, బిజెపి వైపు చూస్తున్నారని,టీ ఆర్ ఎస్ ప్రభుత్వానికి చరమగీతం పాడడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు మోదినపెల్లి వెంకన్న,ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు రడపాక ప్రదీప్,దయాకర్ తదితరులు ఉన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.