తెలంగాణ ప్రజల తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పు కనిక-దొడ్డి కొమురయ్య

భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి వీర తెలంగాణ ప్రజల తెగువ పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పు కనిక కామ్రేడ్ దొడ్డి కొమురయ్య అని సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనక రెడ్డి అన్నారు. సోమవారం కామ్రేడ్ దొడ్డి కొమురయ్య వర్ధంతిని పురస్కరించుకొని సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి అధ్యక్షతన 76 వర్ధంతి కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా పార్టీ జిల్లా నేతలు దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి కనకా రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రైతంగ సాయుధ పోరాటంలో కడవెండి గ్రామంలో విస్నూరు దేశముఖ్ ఆగడాలకు వ్యతిరేకంగా జరిగిన ఆంధ్ర మహాసభ ర్యాలీలో మొదటి తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని అన్నారు. జులై 4న ప్రభుత్వమే అధికారికంగా దొడ్డి కొమురయ్య వర్ధంతిని జరపాలని వారు డిమాండ్ చేశారు. నేడు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం మనుషుల మధ్య మత ఘర్షణలు కులకర్షణలు లేపి దోపిడీదారులకు ప్రజల సంపద అంత కట్టబెడుతున్నారని ప్రజలు మూఢత్వం నుండి బయటపడేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నాలను తిప్పి కొట్టాలన్నారు. సమాజంలో వివిధ రకాల దోపిడి రక్షణకై మతవ్యవస్థ ఉందన్నారు. దేశాన్నిలౌకిక ప్రజాతంత్ర రిపబ్లిక్ గా ప్రకటించుకున్నామని భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అభ్యుదయ వాదులపై ఉందన్నారు. హిందుత్వ మనువాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వామపక్షవాదులపై దాడులను కలిసికట్టుగా పోరాడాలని మతోన్మాద శక్తులను ఎదిరించి పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పోత్కునూరి ఉపేందర్ భూక్య చందు నాయక్ ఎండి అజారుద్దీన్ పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మీ నరసింహరెడ్డి ప్రజా సంఘాల జిల్లా నాయకులు దూసరి నాగరాజు బీ ధర్మభిక్షం మల్లేష్ రాజ్ కనకాచారి మంగ బీరయ్య సాయి కుమార్ విప్లవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.