Telugu News Today | తెలుగు వార్తలు |Telugu News|Latest News in Telugu|

తెలంగాణ బీడీ టేకేదార్ల రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం. కామారెడ్డి లో రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ బీడీ& సిగార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి SV రమ గారు హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వేలాది మంది బీడీ పరిశ్రమలో టేకేదార్లు పని చేస్తున్నారని అన్నారు. చాలీచాలని వేతనాలతో టేకేదారులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.పెరుగుతున్న ధరలకు అనుకూలంగా 25 శాతం కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కమిషన్ అగ్రిమెంట్ సమయం పూర్తి అవుతున్న యాజమాన్యం నూతన అగ్రిమెంట్ చేయకుండా కాలయాపన పేరుతో మోసం చేస్తోందని విమర్శించారు.అన్ని కంపెనీల యాజమాన్యాలు వివిధ పద్ధతులలో మోసం చేసే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. బీడీ కార్మికుల వద్దనుండి కూలి లోని వివిధ పద్ధతుల్లో మూడు రూపాయల నుండి ఎనిమిది రూపాయల వరకు యాజమాన్యాలు దోపిడీ చేసుకుంటూ కార్మికుల ముందు టేకేదార్లను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తోందని ఇలాంటి విషయాలను వెంటనే మానుకుని మూడు రూపాయల నుండి 5 రూపాయల వరకు కట్ చేసుకునే విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.టేకేదార్లకు పిఎఫ్ నంబర్ మంజూరు చేసి గుర్తింపు కార్డు వెంటనే ఇవ్వాలని అన్నారు.గత అగ్రిమెంట్ సందర్భంగా ఒప్పుకున్న డిమాండ్లను కూడా యాజమాన్యాలకు పూర్తిగా అమలు చేయడం లేదని విమర్శించారు. టేకేదార్ల దగ్గరనుండి డిపాజిట్ల రూపంలో తీసుకున్నా డబ్బులను వెంటనే బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేయాలని డిమాండ్ చేశారు.టేకేదార్లoదరికీ ఈఎస్ఐ పీఎఫ్ ప్రమాద బీమా సౌకర్యం లాంటివి కల్పించాలని, న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కారం చేసి అగ్రిమెంట్ వెంటనే పునరుద్ధరించి వారిని కాపాడాల్సిన బాధ్యత యాజమాన్యం పైన ఉందని డిమాండ్ చేశారు.కనీస వేతనాలు జివో ను రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో పెట్టి వివిధ కేటగిరీల కార్మికులను మోసం చేస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలతో 29 కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికుల హక్కులను హరిస్తున్నదని మండిపడ్డారు. బీడీ పరిశ్రమ పైన అనేక రకాల ఆంక్షలు విధిస్తూ బీడీ కార్మికులను మోసం చేస్తుందని విమర్శించారు. దేశంలో కోటికి పైగా ఉపాధి పొందుతున్న అతి పెద్ద పరిశ్రమ ఇలాంటి పరిశ్రమకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపకుండా ఉన్న ఉపాధిని దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం చట్టాలు మారుస్తూ కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మరియు బీడీ పరిశ్రమ యాజమాన్యాల కార్మిక వ్యతిరేక విధానాలకు టేకేదారులందరు ఐక్యమత్యంతో పోరాటాలు చేసి తమ హక్కులను కాపాడుకోవాలనీ పిలుపునిచ్చారు విచ్చిన్నకర సంఘాలతో కార్మికులు జాగ్రత్తగా ఉండాలని అని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ఎల్లయ్య.రాష్ట ఉపాధ్యక్షులు కె.గోపాలస్వామి .నుర్జాహన్,బాలమణి, కోశాధికారి జి.బాస్కర్ , కామారెడ్డి జిల్లా సిఐటియు కన్వీనర్ కె.చంద్రశేఖర్ .. దశరథ్..దెవాదాసు.A.శంకర్..మహదేవ్..సాయులు..లక్మీనారయణ..సిరిగదా లక్ష్మన్,గాలి నారాయణ.. నర్సింలు.. అంజయ్య..అల్వాల్ నర్సింలు.. రాజ్యలక్ష్మి….,………..,………. ఇట్లు……..,………K.చంద్రశేఖర్..CITU జిల్లా కన్వీనర్

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.